Priyanka Gandhi : హస్తం పేదల నేస్తం – ప్రియాంక
మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి
Priyanka Gandhi : పాలేరు – తెలంగాణలో మార్పు రావాల్సిన అవసరం ఉందని , మీ విలువైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేయాలని పిలుపునిచ్చారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలేరులో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సాదర స్వాగతం లభించింది. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నం చేశారు. వారితో నినాదాలు చెప్పేలా చేశారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని అన్నారు.
Priyanka Gandhi Words
హస్తం పేదల నేస్తమని, తమ పార్టీ ఇచ్చిన మాట తప్పదన్నారు. ఆనాడు ఏపీలో నష్టం కలుగుతుందని తెలిసినా తన తల్లి సోనియా గాంధీ తెలంగాణ బిడ్డల బలిదానాలు చూసి తట్టుకోలేక పోయిందన్నారు. అందుకే ఎంతో మంది వద్దన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. ఇవాళ కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఒకే ఒక్క ఫ్యామిలీ మాత్రమే బాగు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందజేస్తామని, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుందన్నారు. కర్ణాటక గురించి పదే పదే విమర్శిస్తున్న కేసీఆర్ కు సోయి లేదన్నారు . ఇకనైనా తెలుసుకుని ఆరోపణలు చేయాలని సూచించారు.
Also Read : Rahul Gandhi : మోదీతో ఓవైసీ..కేసీఆర్ దోస్తానా
