Mallikarjun Kharge : అధికారం అస్త‌వ్య‌స్తం పాల‌న దారుణం

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్

Mallikarjun Kharge : హైద‌రాబాద్ – నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన ఘ‌నత కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. శ‌నివారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా హైద‌రాబాద్ లోని స‌న‌త్ న‌గ‌ర్ లో పార్టీ అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన రోడ్ షోలో ప్ర‌సంగించారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.

Mallikarjun Kharge Comments on KCR

హైద‌రాబాద్ ను ఇస్తాంబుల్ గా మారుస్తాన‌ని చెప్పిన కేసీఆర్ ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌మై పోయార‌ని ఆరోపించారు. ఇక్క‌డ ప్ర‌జ‌ల క‌ల‌లు, ఆకాంక్ష‌ల‌ను తుడిచి పెట్టేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఐటీ హ‌బ్ కు శ్రీ‌కారం చుట్టింది కాంగ్రెస్ పార్టీనేన‌ని పేర్కొన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల‌న్నీ ఒక్క‌టేన‌ని వారిని న‌మ్మి ఓటు వేస్తే ప‌ప్పులో కాలు వేసిన‌ట్లు అని హెచ్చ‌రించారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge). 10 ఏళ్ల కేసీఆర్ పాల‌న వ‌ల్ల హైద‌రాబాద్ లో రోడ్లు, గుంత‌లు, నీటి ఎద్ద‌డి, వ‌ర‌ద‌లు ఏర్ప‌డ‌డం త‌ప్ప జ‌రిగిన అభివృద్ది ఏమీ లేద‌న్నారు .

త‌మ పార్టీ పాల‌న‌లోనే హైద‌రాబాద్ లో ప్ర‌తిష్టాత్మ‌కమైన రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు నిర్మించ‌డం జ‌రిగింద‌న్నారు. అంతే కాకుండా పీవీ న‌ర‌సింహారావు ఎక్స్ ప్రెస్ వే ను నిర్మించింది కూడా తామేన‌ని స్ప‌ష్టం చేశారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.

Also Read : Priyanka Gandhi : హ‌స్తం పేద‌ల నేస్తం – ప్రియాంక

Leave A Reply

Your Email Id will not be published!