Minister KTR : చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన దీక్ష‌

ఐటీ మంత్రి కేటీఆర్ కామెంట్స్

Minister KTR : హైద‌రాబాద్ – కేసీఆర్ దీక్షకు దిగి నేటితో 14 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్బంగా బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివ‌స్ ను నిర్వ‌హిస్తోంది. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌ల్లి తెలంగాణ సంకెళ్ల‌ను తెంచిన స‌త్యాగ్ర‌హంగా పేర్కొన్నారు. స్వ‌రాష్ట్ర స‌మ‌రంలో స‌ముజ్వ‌ల స‌న్నివేశమ‌ని , స్వాతంత్ర పోరాటాన్ని మించిన స‌మున్న‌త సంద‌ర్భంగా నిలిచింద‌ని తెలిపారు కేటీఆర్.

Minister KTR Praises

యావ‌త్ జాతి ఏక‌మై ఉద్య‌మం క‌డ‌లి లాగా ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డిన దృశ్యం ఎవ‌రూ మ‌రిచి పోలేర‌న్నారు. చావు నోట్లో త‌ల పెట్టి గెలిచిన సాహ‌సంగా కేసీఆర్ నిలిచార‌ని కొనియాడారు కేటీఆర్(Minister KTR). ఉద్య‌మ సార‌థిగా గుర్తింపు పొందారు. ఢిల్లీ మెడ‌లు వంచిన ధీర‌త్వం ఆద‌ర్శ ప్రాయంగా నిలిచింద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ స‌చ్చుడో తెలంగాణ వ‌చ్చుడో అన్న నినాదం పోరాటానికి స్పూర్తి ఇచ్చింద‌ని తెలిపారు.

ఆమ‌ర‌ణ రణ నినాదం, చెక్కు చెద‌ర‌ని ఉక్కు సంక‌ల్పం, ఆత్మ గౌర‌వ ప‌తాకాన్ని ఎగుర వేసిన స‌న్నివేశం..స‌క‌ల జ‌నుల స‌మ్మేళ‌న‌మ‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. అర్ధ‌రాత్రి స్వాతంత్ర ప్ర‌క‌ట‌నతో నెర‌వేరింద‌న్నారు.

సాహ‌సోపేత నినాదాల‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి స్వ‌ప్నాన్ని స‌త్యంగా మ‌లిచి గ‌మ్యాన్ని ముద్దాడిన సిపాయి కేసీఆర్ అని కొనియాడారు. ప్ర‌తి ఒక్క‌రు దీక్షా దివ‌స్ ను నిర్వ‌హించు కోవాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : Kamareddy Tension : కామారెడ్డిలో టెన్ష‌న్ టెన్షన్

Leave A Reply

Your Email Id will not be published!