Revanth Reddy : రెండు చోట్ల రేవంత్ రెడ్డి లీడ్

తెలంగాణ‌లో కాంగెస్ హ‌వా

Revanth Reddy : తెలంగాణ – రాష్ట్రంలో ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్టుగానే వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 21కి పైగా స‌ర్వే సంస్థ‌లు, మీడియా సంస్థ‌లు గంప గుత్త‌గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని పేర్కొన్నాయి. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు , ముఖ్య నేత‌లు వెనుకంజ‌లో కొన‌సాగుతుండ‌డం బిగ్ షాక్ కు గరి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీకి చెందిన నేత‌లు, శ్రేణులు సంబురాల‌లో మునిగి పోయారు.

Revanth Reddy Lead Viral

సీఎం అభ్య‌ర్థిగా ప్రచారంలో ఉన్న టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) రెండు చోట్ల బ‌రిలో ఉన్నారు. ఆయ‌న కోడంగ‌ల్ తో పాటు కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోటీ చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ వైపు ఓట‌ర్లు మొగ్గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పూర్తిగా హ‌స్తానికి మొగ్గు చూపారు.

బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ కు ఊహించ‌ని దెబ్బ క‌లిగింది. ఆయ‌న ఏకంగా కామారెడ్డిలో మూడో స్థానానికి ప‌డి పోయారు. రేవంత్ రెడ్డి కోడంగ‌ల్ లో పూర్తి ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. నియంత పాల‌న‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌జ‌లు సిద్ద‌మ‌య్యారు. ఆ మేర‌కు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు.

ఇక బీజేపీకి చెందిన ఈట‌ల రాజేంద‌ర్ కు కోలుకోలేని షాక్ త‌గ‌ల‌నుంది. ఆయ‌న ఇటు గ‌జ్వేల్ లో అటు హుజూరాబాద్ లో ఓట‌మి అంచుల్లో ఉన్నారు.

Also Read : Chandra Babu Naidu : ఏపీపై తండ్రీ కొడుకుల ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!