Seethakka : అన్న‌కు చెల్లెలు అభినంద‌న‌

రేవంత్ రెడ్డికి సీత‌క్క కంగ్రాట్స్

Seethakka : హైద‌రాబాద్ – స్వంత సోద‌రుడిగా భావించే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా నియ‌మితులైన రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ములుగు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన దాస‌రి సీత‌క్క. త‌న కుటుంబంతో క‌లిసి రేవంత్ కు పుష్ప‌గుచ్ఛం ఇచ్చి అభినంద‌న‌లు తెలిపారు.

Seethakka Meet Revanth Reddy

ఇక సీత‌క్క గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. గ‌తంలో న‌క్స‌లైట్ గా ఉన్నారు. ఆమె ధైర్యాన్ని చూసిన ఆనాటి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సీత‌క్క‌కు(Seethakka) పాలిటిక్స్ లో ఛాన్స్ ఇచ్చారు. ఆనాటి నుంచి నేటి దాకా వెనుదిరిగి చూడ‌లేదు.

కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగారు. ఎల్ల‌ప్పుడూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉండేందుకు ప్ర‌య‌త్నం చేశారు దాస‌రి సీత‌క్క‌. తాను ఎమ్మెల్యేగా గెలుపొందినా ఏనాడూ అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించ లేదు. ప్ర‌జ‌ల‌ను ప్రేమించారు. వారికి క‌ష్టం వ‌చ్యిన‌ప్పుడు అండ‌గా నిలిచారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా ఇబ్బందికి గురి చేసిన క‌రోనా స‌మ‌యంలో త‌ను ప్రాణాల‌ను లెక్క చేయ‌కుండా సేవ‌లు అందించారు. అహ‌ర్నిశ‌లు నిద్ర‌హారాలు మాని ప‌ని చేశారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ప్ర‌జా నాయ‌కురాలిగా పేరు పొందారు. భారీ మెజారిటీని క‌ట్ట‌బెట్టారు. మొత్తంగా సీత‌క్క‌కు కీల‌క‌మైన ప‌ద‌వి ద‌క్క‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : Ramdas Roy Manthena : టీఎస్పీఎస్సీని ప్ర‌క్షాళ‌న చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!