Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈనెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే సభ సాక్షిగా కొలువు తీరనున్నారు. ఈ మేరకు సంతకం చేయనున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది.
Revanth Reddy is swearing in
ఇందుకు సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అధికారికంగా చేపట్టడంతో ఉన్నతాధికారులు ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీఎంగా కొలువు తీరనుండడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, అతిరథ మహారథులు హాజరు కానున్నారు.
ప్రాథమిక సమాచారం మేరకు కీలకమైన నేతలు రానున్నారు. వీరిలో ప్రధానంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణు గోపాల్, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఎంపీలు కూడా హాజరు కానున్నారు.
ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీల నేతలను , ప్రజా ప్రతినిధులను కూడా రావాలని ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు నూతన సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : Congress Cabinet : హస్తినలో మకాం కేబినెట్ కు శ్రీకారం
