Bhadradri : వైకుంఠ ఏకాదశికి భద్రాద్రి ముస్తాబు
13 నుంచి అధ్యయన ఉత్సవాలు
Bhadradri : భద్రాద్రి – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన భద్రాద్రి ఆలయంలో అధ్యయన ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల 23న వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో. ఈ ఉత్సవాలలో భాగంగా ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి.
Bhadradri Temple Decoration
ఉత్సవాలను పురస్కరించుకుని 13 నుంచి 23వ తేదీ వరకు భద్రాద్రి ఆలయంలో నిత్య కళ్యాణాల నిర్వహణను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారి వెల్లడించారు. దీనిని భక్తులు గమనించాలని , తమతో సహకరించాలని కోరారు.
భద్రాచలం అనే పేరున్న దానిని భద్రాద్రి అని పేరు మార్చారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. యాదగిరి గుట్ట ఆలయాన్ని కూడా పేరు మార్చారు. దానికి యాదాద్రి అని పేరు పెట్టారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు భక్తులు. అయినా మాజీ సీఎం కేసీఆర్(KCR) ఒప్పుకోలేదు.
భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైనా ఎలాంటి మార్పు రాలేదు. ప్రస్తుతం కేసీఆర్ సర్కార్ కూలి పోయింది. దాని స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడైనా పేర్లు మారుస్తారో లేదో చూడాలి.
Also Read : Sachin kohli : సచిన్..కోహ్లీకి అరుదైన గౌరవం