Congress Ministers : రాష్ట్రంలో నూతనంగా కొలువు తీరిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో కీలక పదవులు పొందారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క. ఈ ముగ్గురికీ కీలక శాఖలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Congress Ministers Grand Welcome Viral
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రిగా రేవంత్ ఉండగా ఉప ముఖ్యమంత్రి పోస్టును మల్లు భట్టి విక్రమార్కకు ఇచ్చారు. ఇదే సమయంలో తాజాగా కీలకమైన శాఖలు కూడా ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ ముగ్గురు భారీ భద్రత , కాన్వాయ్ మధ్య తమ స్వంత జిల్లా ఖమ్మంకు బయలుదేరి వెళ్లారు.
వేలాది మంది జనం సాదర స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్ రావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్రాండ్ విక్టరీ సాధించారు.
గెలుపొందిన అనంతరం శాసన సభలో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. తాము ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు.
Also Read : Nara Lokesh : కౌలు రైతులను ఆదుకోవాలి
