President Murmu : నేర బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
కొత్త బిల్లులకు చట్ట బద్ధత
President Murmu: న్యూఢిల్లీ – దేశంలో కీలకమైన బిల్లులకు మోక్షం లభించింది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పీఎం పదే పదే చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో వీటిని సాధ్యమైనంత మేరకు మార్చాలని పిలుపునిచ్చారు.
President Murmu Approved
పార్లమెంట్ ఉభయ సభలలో ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు లేకుండానే చట్టాలకు తీర్మానం చేసేలా ప్లాన్ చేసింది కేంద్రం. దీని వెనుక వ్యూహం పన్నారు ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.
సోమవారం మూడు కొత్తగా క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో నేర బిల్లులకు ఇవాల్టి నుంచి చట్ట బద్దత వచ్చినట్లయింది. ఇందులో బిల్లుల పరంగా చూస్తే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యం ఆధీనంకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లులకు ద్రౌపది ముర్ము(President Murmu) ఆమోదం తెలిపింది.
Also Read : Nara Lokesh : సీఎం షేరింగ్ లేదు – లోకేష్