Gorantla Butchaiah Chowdary: ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి !

ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి !

Gorantla Butchaiah Chowdary: శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజ్‌భవన్‌లో ఈరోజు (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. బుచ్చయ్య చౌదరితో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శనివారం నుంచి రెండురోజుల పాటు ప్రొటెం స్పీకర్‌గా 174 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీఎం చంద్రబాబు గోరంట్ల(Gorantla Butchaiah Chowdary)కు ఈ అవకాశం కల్పించారు. ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు.

Gorantla Butchaiah Chowdary…

కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఏపీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిను టీడీపీ అధినేత ఎంపిక చేసారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి బుచ్చయ్య చౌదరి ఎన్నికైన విషయం తెలిసిందే. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీనియర్‌ ఎమ్మెల్యే కావడంతో ఆయనే ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యారు.

Also Read : Gudem Mahipal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు !

Leave A Reply

Your Email Id will not be published!