Telangana High Court: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు

Telangana High Court : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. దోషులకు ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సమర్థించింది. అయితే నిందితుల్లో ఒకరైన ఏ6 అజాజ్ షేక్ సమర్ అర్మాన్ తరపున న్యాయవాది మహమ్మద్ షుజావుల్లా ఖాన్ ఈ కేసును హైకోర్టులో వాదించారు. ఈ కేసులో వీరి ప్రమేయం లేదన్నారు. వీరికీ ఏం తెలియదన్నారు. హైకోర్టు(Telangana High Court) తీర్పుపై తాము మరికొద్ది నెలల్లో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని నిందితుల తరఫు న్యాయవాది మహమ్మద్ షుజావుల్లా ఖాన్ స్పష్టం చేశారు.

మరోవైపు ఈ కేసులో దోషులుగా తేలిన వారి తరఫున వాదించి న్యాయవాదిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులకు ఉరి శిక్ష పడిన అనంతరం కోర్టు బయట… న్యాయవాది మహమ్మద్ షుజావుల్లా ఖాన్ మీడియాతో మాట్లాడుతోన్న వీడియో వైరల్ అయింది. అతడిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా… అతడిపై కామెంట్ల రూపంలో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telangana High Court – ఇంతకీ ఏం జరిగిందంటే ?

2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాపులో, మిర్చిపాయింట్‌ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. వారిలో పలువురు నేటికి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్‌ రియాజ్‌ అలియాస్‌ రియాజ్‌ భత్కల్‌ పరారీలో ఉండగా… మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబరు 13న తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హద్ది, జియా ఉర్‌ రహమాన్‌ అలియాస్‌ వఘాస్‌ అలియాస్‌ నబీల్‌ అహమ్మద్, మహ్మద్‌ తహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ హసన్‌ అలియాస్‌ మోను, యాసిన్‌ భత్కల్‌ అలియాస్‌ షారూఖ్, అజాజ్‌ షేక్‌ అలియాస్‌ సమర్‌ ఆర్మాన్‌ తుండె అలియాస్‌ సాగర్‌ అలియాస్‌ ఐజాజ్‌ సయ్యద్‌ షేక్‌ ఉన్నారు.

అయితే ఉరిశిక్ష ధ్రువీకరణ నిమిత్తం ఎన్‌ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. దీనితోపాటు ఐదుగురు నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం సుమారు 45 రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది. నేడు ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనితో హైకోర్టు తీర్పుపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచారు.

Also Read : Minister Parameshwara: లైంగిక వేధింపుల విషయంలో చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి క్షమాపణ

Leave A Reply

Your Email Id will not be published!