Botcha Satyanarayana: మాజీమంత్రి బొత్సకు అస్వస్థత ! “వెన్నుపోటు దినం”లో స్పృహ తప్పిన బొత్స !
మాజీమంత్రి బొత్సకు అస్వస్థత ! "వెన్నుపోటు దినం"లో స్పృహ తప్పిన బొత్స !
Botcha Satyanarayana : వైసీపీ సీనియర్ నేత , మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు బుధవారం చీపురుపల్లిలో “వెన్నుపోటు దినం” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చీపురుపల్లిలోని స్థానిక కొత్త పెట్రోల్ బంక్ నుంచి సుమారు కిలోమీటరన్నర వరకు ఎండలోనే ర్యాలీని నిర్వహించారు. వైసీపీ నేతలు, బొత్స సత్యనారాయణ(Botcha Satyanarayana) కాలినడకన మూడు రోడ్లు జంక్షన్ వరకు నడిచారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రచార వాహనంపైకి ఎక్కి మాట్లాడుతుండగా ఒక్కసారిగా బొత్స సత్యనారాయణ కుప్పకూలిపోయారు. దీనితో అక్కడున్న నేతలు హుటాహుటిన బొత్సను తన వాహనంలోనికి ఎక్కించి విజయనగరం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసారు. అయితే కాసేపటికి అతని మరల స్పృహలోనికి రావడంతో పాటు తనకు బాగానే ఉందంటూ… క్యాంప్ ఆఫీసుకు వెళ్తామని సూచించారు. దీనితో బొత్సాను తన క్యాంప్ ఆఫీసుకు తరలించారు.
Botcha Satyanarayana Health Issue
దీనిలో బొత్స(Botcha Satyanarayana) క్యాంప్ ఆఫీసుకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఇచ్చిన సమాచారంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పాటు డాక్టర్ విజయసారధి, డాక్టర్ నీలకంఠేశ్వరరావు… బొత్స క్యాంపు ఆఫీసుకు చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. మండుటెండలో కిలోమీటరుకి పైగా నడవడం వలన అస్వస్థతకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. దీనితో అస్వస్థత నుండి కోలుకున్న అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తూ బొత్స విజయనగరం చేరుకున్నారు. అనంతరం అక్కడ నుండి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లారు.
ఈరోజు వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ గారు ఇచ్చిన పిలుపుమేరకు వెన్నుపోటు సభ లో ప్రసంగిస్తుండగా.. నేను స్వల్ప అస్వస్థతకు గురవడం జరిగింది.. అనంతరం వెంటనే నేను దేవుని దయ, మీ అందరి ఆశీర్వాదాలతో కోలుకోవడం జరిగింది. నా ఆరోగ్యం పట్ల ఎవరు ఆందోళన చెందవద్దు. వైయస్ఆర్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, అని బొత్స సత్యనారాయణ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.
Also Read : Caste Census : కులగణనపై కేంద్ర క్యాబినెట్ కీలక అప్డేట్
