Minister TG Bharath: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించిన మంత్రి టీజీ భరత్
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించిన మంత్రి టీజీ భరత్
TG Bharath : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ లో ఉన్న పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళికలపై అధికారులు ఆయనకు ప్రజంటేషన్ ఇచ్చారు. ప్లాంట్ కార్యకలాపాలను పునరుద్ధరించడంతో పాటు ఆ దిశగా నడిపించడంలో ఉద్యోగులు, వాటాదారుల కృషిని మంత్రి ప్రశంసించారు.
Minister TG Bharath Visit Vizag Steel Plant
సెప్టెంబర్ 2024 నుంచి విశాఖ ఉక్కులో ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని టీజీ భరత్ సంతృప్తి వ్యక్తం చేశారు. కర్మాగారాన్ని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. క్యాప్టివ్ మైన్స్ విషయాన్ని కేంద్రం దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకువెళ్తారన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచేందుకు తేలియాడే సౌర విద్యుత్ సంస్థాపనలు, సాంకేతిక అడ్డంకులను తొలగించడం వంటి ఖర్చు ఆదా వ్యూహాలను అవలంభించాలని ఆయన సూచించారు. స్టీల్‌ప్లాంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
