AP Liquor Scam: మాజీమంత్రి నారాయణస్వామిని ప్రశ్నించిన సిట్‌ అధికారులు

మాజీమంత్రి నారాయణస్వామిని ప్రశ్నించిన సిట్‌ అధికారులు

AP Liquor Scam : ఏపీ మద్యం కేసులో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కె.నారాయణ స్వామిని పుత్తూరులోని ఆయన నివాసంలో సిట్‌ అధికారులు 6గంటల పాటు ప్రశ్నించారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీలో మార్పులు (AP Liquor Scam), మద్యం ఆర్డర్స్‌లో ఆన్‌లైన్‌ విధానం తీసేసి మాన్యువల్‌ తేవడంపైనా ప్రధానంగా విచారించినట్టు సమాచారం. సిట్ విచారణ అనంతరం మాజీ మంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. ‘‘సిట్ అధికారులు నాలుగు ప్రశ్నలు అడిగారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాను. సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని తెలిపాను. మరోసారి విచారణకు రావాలని అధికారులు నోటీసు ఇచ్చారు’’ అని తెలిపారు. వైసీపీ హయాంలో కె.నారాయణస్వామి ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

AP Liquor Scam Updates

వైసీపీ (YSRCP) హయాంలో ఏపీ జరిగిన లిక్కర్‌ స్కామ్‌ కేసులో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి కీలకంగా ఉండటంతో శుక్రవారం ఉదయం నుంచి నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించారు. ఆరు గంటల పాటు కొనసాగిన విచారణ ముగిసింది. అయితే ఈ విచారణలో నారాయణ స్వామి సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేసినట్లు తెలుస్తోంది. సిట్ వేసిన అనేక ప్రశ్నలకు తనకేం తెలీదనే మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి సమాధానాలిచ్చినట్లు సమాచారం. మద్యం పాలసీలో మార్పులు, మద్యం ఆర్డర్స్‌లో ఆన్‌లైన్ విధానం తొలగింపు వంటి అంశాలపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది.

మద్యం ఆర్డర్లకు ఆన్‌లైన్ విధానం పక్కన పెట్టిన అంశంపైనా నారాయణ స్వామి నుంచి సమాధానం రాలేదు. డిజిటల్ చెల్లింపులు పక్కన పెట్టాలని ఎవరూ ఒత్తిడి తెచ్చారన్న ప్రశ్నలకూ తనకు సంబంధం లేదని పై వాళ్ల నిర్ణయమని చెప్పారు నారాయణ స్వామి. మద్యం పాలసీ రూపకల్పన మొదలుకుని… అమ్మకాల వరకు తనకేం సంబంధం లేదని పై స్థాయి నిర్ణయాలని చెప్పారు. రాజ్‌ కసిరెడ్డితో సహా ఇతరులు ఇచ్చిన సమాచారంతో సేకరించిన ఆధారాలను తన ముందు పెట్టి సిట్ అధికారులు నారాయణ స్వామిని ప్రశ్నించారు. అయితే ఆయన సరైన సమాధానాలు చెప్పక పోవడంతో మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయి.

Also Read : BJP Leaders: సచివాలయం వద్ద ఉద్రికత్త ! బీజేపీ నేతలు అరెస్ట్‌ !

Leave A Reply

Your Email Id will not be published!