CM Chandrababu: ఎగతాళి చేసిన సూపర్ సిక్స్‌ ను సాధ్యం చేసి చూపించాం – సీఎం చంద్రబాబు

ఎగతాళి చేసిన సూపర్ సిక్స్‌ ను సాధ్యం చేసి చూపించాం - సీఎం చంద్రబాబు

CM Chandrababu : కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను… వైసీపీ నాయకులు ఎగతాళి చేశారని… వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారని… అయితే తాము వాటిని అమలు చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబుకు (CM Chandrababu)… స్థానిక నాయుకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛతా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అందర్నీ పలకరిస్తూ ముందుకు సాగారు. వారి సమస్యలు తెలుసుకుంటూ, అవసరమైన చర్యలను చేపట్టాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.

CM Chandrababu Key Comments on Super Six

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ… 2047 నాటికి రాష్ట్రంలో ప్రతిఒక్కరి మొహంలో ఆనందం చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది కానీ చెత్త ఎత్తే కార్యక్రమం చెయ్యలేదు. కూటమి ప్రభుత్వం ఏడు నెలలుగా ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇంట్లో చెత్త బయట పడేయటం వలన అంటూ వ్యాధులు ప్రభలుతున్నాయి. అక్టోబర్ రెండో తేదీలోపు 85టన్నుల చెత్తను సేకరిస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోంది. 2047 నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం చూడాలి’ అని చంద్రబాబు అన్నారు.

‘ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు చాలా సౌమ్యులు. ఇలాంటి చోట కూడా గతంలో రౌడీయిజం చేశారు. మేం పెద్దాపురంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంటును ప్రారంభించబోతున్నాం. వర్షాకాలంలో దోమల వల్ల రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. డ్రోన్స్ ఉపయోగించి రాష్ట్రంలో దోమల సమూల నివారణకు చర్యలు తీసుకుంటాం. సూపర్ సిక్స్‌ను ఎగతాళి చేశారు. సాధ్యం కాదు అన్నారు. సాధ్యం చేసి చూపించా. 2027లో పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అమృత్ పథకంలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో 75 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీటి కుళాయి వేయిస్తాం. ఎన్డీఏకు పెద్దాపురం నియోజకవర్గం కంచుకోట. ఇక్కడ మరొకరికి అవకాశం ఇవ్వకూడద’ని చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu – ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలే వైసీపీ సిద్దాంతాలు – సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు… వైసీపీ ఫేక్ ప్రచారాలపై మండిపడ్డారు. 10 ఏళ్లలో జరిగిన 10 సంఘటనలు చెప్పి… వైసీపీ కుట్ర రాజకీయాలు, జగన్ క్రిమినల్ పాలిటిక్స్‌పై విమర్శలు గుప్పించారు. వివేకా హత్య కేసు, కోడి కత్తి డ్రామా, గులకరాయి దాడి, పింఛన్ల నిలిపివేత తదితర అంశాలను ప్రజలకు వివరించారు. వైసీపీ తప్పుడు ప్రచారాలపై ధ్వజమెత్తారు. వైసీపీవి విష, ఫేక్ రాజకీయాలు అంటూ విరుచుకుపడ్డారు.

CM Chandrababu – సీఎం చంద్రబాబు కాన్వాయ్ అడ్డుపడిన రైతు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటనలో ఓ హఠాత్పరిణామం చోటు చేసుకుంది. గొల్లప్రోలుకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ కు అడ్డుపడ్డాడు. తన భూమి ఆన్లైన్‌లో తక్కువగా చూపిస్తోందని, తనకు న్యాయం చేయాలని ఓ ఫ్లెక్సీ పట్టుకుని సీఎం కాన్వాయ్‌కు ఎదురుగా నిలబడ్డాడు. అతడిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌ను ఆపి ఆ రైతుతో మాట్లాడారు. వివరాలు తెలుసుకుని సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆ రైతుకు చంద్రబాబు హామీనిచ్చారు. అక్కడే గంగాధర్‌తో పాటు పలువురి నుంచి సీఎం చంద్రబాబు వినతి పత్రాలను స్వీకరించారు.

Also Read : Minister Nadendla Manohar: 4 విడతల్లో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ – మంత్రి నాదెండ్ల మనోహర్‌

Leave A Reply

Your Email Id will not be published!