Urea Shortage: యూరియా కొరతపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లు డ్రామాలు ఆడుతున్నాయి – సీఎం రేవంత్‌

యూరియా కొరతపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లు డ్రామాలు ఆడుతున్నాయి - సీఎం రేవంత్‌

Urea Shortage : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూరియా కొరతపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి డ్రామాలాడుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. యూరియా (Urea) ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని కేటీఆర్‌ అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోందని విమర్శించారు. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిశానని సీఎం రేవంత్‌ తెలిపారు. యూరియా (Urea) పంపిణీ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో మానిటరింగ్‌ను పెంచాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. శనివారం గాంధీ భవన్‌లో మూడు గంటల పాటు జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌ మాట్లాడారు.

Urea Shortage Updates

‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించినందుకు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కులను కాపాడటం కోసం పని చేశారు. రాహుల్ గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టాo. బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రి వర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకున్నాం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చాం. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చాం.. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు. బీసీ లకు మేలు జరగాల్సిందే. రాహుల్ గాంధీ మాట నిలబడాలి. 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పైన సుప్రీంకోర్టు లో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించాం. బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్రకు ఈ నెల 26వ తేదీన హాజరవుతా’ అని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Urea Shortage – జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేయాలి – మంత్రి పొన్నం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. ప్రజాభవన్‌ లో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లో 6 వేల కొత్త రేషన్‌కార్డులు ఇచ్చినట్లు గుర్తించారు. అధికార పార్టీకి అవకాశమిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

ప్రతి బూత్‌కు ఒకరు ఇన్‌ఛార్జిగా ఉండాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఎక్కడా ఉండకూడదని సూచించారు. నియోజకవర్గంలోని 7 డివిజన్లలో ఇన్‌ఛార్జి ఉపాధ్యక్షులు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు ప్రభావవంతంగా పని చేయాలని తెలిపారు. డివిజన్లలో కార్యాలయాలు ప్రారంభించుకోవాలని.. బూత్‌వారీగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెండింగ్‌లో ఉన్న ఇతర ప్రభుత్వ పథకాలను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌ పాల్గొన్నారు.

Also Read : CM Revanth Reddy: రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు – సీఎం రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!