Mahesh Kumar Goud: బండి సంజయ్ పై మహేష్‌ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ పై మహేష్‌ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud : కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీ కాదని… దేశ్‌ముఖ్ అని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ సంచలన ఆరోపణ చేసారు. బీసీల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా ? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు అని ఆక్షేపించారు. తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీనంగర్‌ జిల్లా చొప్పదండిలో నియోజకవర్గంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ రెండోదశ జనహిత పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగ ఓట్లతోనే తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిచారని అనుమానం వ్యక్తం చేశారు మహేష్‌కుమార్‌గౌడ్.

Mahesh Kumar Goud Shocking Comments on Union Minister Bandi Sanjay

కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీ కాదని.. దేశ్‌ముఖ్ అని మహేష్‌ కుమార్‌ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. బీసీల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు అని ఆక్షేపించారు. దేవుళ్ల పేరుతో తాము ఎప్పుడూ ఓట్లు అడగలేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు రాగానే.. బీజేపీకి దేవుళ్లు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. కులం, మతం లేకపోతే బీజేపీ గెలవదని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖచిత్రంలో భారత రాష్ట్ర సమితి ఉండదు. ఆ పార్టీ ఇప్పటికే మూడు ముక్కలైంది. ఓట్ల చోరీతోనే మోదీ మూడో సారి అధికారంలోకి వచ్చారు’’ అని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు.

Also Read : YouTuber: రీల్స్‌ పిచ్చితో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన యూట్యూబర్ !

Leave A Reply

Your Email Id will not be published!