Traffic Jam: వరద బీభత్సంతో హైవేపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

వరద బీభత్సంతో హైవేపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

Traffic Jam : ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో రహదారులు ధ్వంసమయ్యాయి. ఛండీగఢ్‌-కులు​-మనాలీ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండి-కుల్లు మధ్యలో కొండచరియల విరిగి పడటంతో సహాయక పనులు చేపట్టారు. క్లియరెన్స్ పనులు కారణంగా ట్రాఫిక్‌కు ఆలస్యమవుతోంది. బియాస్ నది ఉధృతంగా ప్రవహించడం వల్ల జాతీయ రహదారిలో పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. మరమ్మతులు కొనసాగుతున్నాయి. కుల్లు ప్రాంతంలోని రామశిల సమీపంలో వరదల ప్రభావంతో ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. మనాలి ఒక వైపు నుండి ఇతర ప్రాంతాలతో ఉన్న రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపొయాయి.

Traffic Jam in Himachal Pradesh

దీనితో జాతీయ రహదారిపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది (Traffic Jam). ప్రధానంగా ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ ప్రాంతానికి పండ్లు, కూరగాయలు తీసుకెళ్తున్న వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి. హైవేపై చిన్న వాహనాలకు అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ… భారీ ట్రక్కులను నిలిపివేశారు. ఆపిల్, టమాటా, ఇతర కూరగాయల లోడ్లు పాడవుతున్నాయని ట్రక్కు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రక్కు లోడ్ విలువ లక్షల్లో ఉంటుందని డ్రైవర్లు చెబుతున్నారు.

మంగళవారం సాయంత్రం నుండి హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వందలాది రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి (Traffic Jam). విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్ 20 నుంచి ఇప్పటివరకు, భారీ వర్షాలు, వరదలు కారణంగా సుమారుగా 158 మంది మరణించగా.. 38 మంది గల్లంతయ్యారు.. రూ. 2,623 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

మండి- కులూ మధ్యనే దాదాపు 12 చోట్ల కొండ చరియలు విరిగిపడినట్లు అధికారులు చెబుతున్నారు. బియాస్‌ నదీ ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల కులూ-మనాలి మధ్య పలుచోట్ల రహదారి కోతకు గురైనట్లు ఎన్‌హెచ్ఏఐ ఇంజినీర్‌ అశోక్‌చౌహాన్‌ తెలిపారు. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. తాజా పరిస్థితులను దృష్టిలోఉంచుకొని విహార యాత్రలు ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు.

Also Read : Mohan Bhagwat: మోదీ పదవీ విరమణపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఆశక్తికర వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!