Defecting MLAs: యూటర్న్ తీసుకున్న తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
యూటర్న్ తీసుకున్న తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
Defecting MLAs : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసన సభ స్పీకర్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పష్టం చేశారు.
Defecting MLAs Shocking Comments
బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేశారు.
కాంగ్రెస్‌లో చేరలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ను కలిశా. బీఆర్ఎస్కు నేను రాజీనామా చేయలేదు-పోచారం శ్రీనివాస్ రెడ్డి
మా ఫోటోలను మార్ఫ్ చేశారు. నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా. నాది బీఆర్ఎస్ ఐడియాలజీ – బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
నేను బీఆర్ఎస్లోనే ఉన్నా. కాంగ్రెస్‌లో చేరానన్నది అబద్ధం- కాలే యాదయ్య
నేను బీఆర్ఎస్లో కొనసాగుతున్నా. కాంగ్రెస్‌లో చేరలేదు. ఇప్పటికి బీఆర్ఎస్కే నా మద్దతు – గూడెం మహిపాల్
ఇప్పటికి బీఆర్ఎస్లోనే ఉన్నా. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశా- అరికెపూడి గాంధీ వివరణిచ్చారు.
Also Read : Minister Nitin Gadkari: ఇ20 ఇంధనం వినియోగంపై కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
