NDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటు

బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటు

NDA Alliance : బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి (NDA Alliance) పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రి చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని లోక్‌ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్‌) 29 స్థానాల్లో బరిలో దిగనుంది. కేంద్ర మంత్రి జీతన్‌ రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం)కు, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)కు ఆరు చొప్పున సీట్లు కేటాయించారు.

బీహార్‌ (Bihar) సీట్ల ఒప్పందం కుదిరిన విషయాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా సీట్ల సర్దుబాటు జరిగిన విషయాన్ని స్పష్టం చేశారు. సీఎం నితీష్‌ కుమార్‌ జేడీయూ పార్టీకి 101 సీట్లు, తమకు(బీజేపీ) 101 సీట్ల సర్దుబాటు జరిగిందన్నారు. చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఒప్పందం కుదిరిందనే విషయాన్ని స్పష్టం చేశారు.

NDA Alliance – సీట్ల పంపకాలు జరిగింది ఇలా

జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లు

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లు

హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం): 6 సీట్లు

రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం): 6 సీట్లు

బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో నీతీశ్‌ పార్టీ 115 స్థానాల్లో బరిలో దిగగా… కాషాయదళం 110 సీట్లకు పోటీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే 22 సీట్లలో పోటీ చేసిన ఎల్‌జేపీ (రాంవిలాస్‌).. ఈసారి అదనంగా మరో ఏడు స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు.. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (మహాగఠ్‌బంధన్‌)లో సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్జేడీ 135-140 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ 70 సీట్లు అడుగుతుండగా 50-52 వరకు ఇస్తామంటోంది. కాగా, బీహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, నవంబర్ 14న లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

Also Read : AP Government: రైడెన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కు రూ.22 వేల కోట్ల ప్రోత్సాహకాలు

Leave A Reply

Your Email Id will not be published!