Chandigarh: చండీగఢ్ బిల్లుపై కేంద్రం ఆశక్తికర వ్యాఖ్యలు
చండీగఢ్ బిల్లుపై కేంద్రం ఆశక్తికర వ్యాఖ్యలు
Chandigarh : కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పంజాబ్‌లోని పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చండీగఢ్ (Chandigarh) లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చేలా రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందరితో చర్చలు జరిపిన తర్వాతే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
Chandigarh Bill Updates
‘‘చండీగఢ్‌కు (Chandigarh) చట్టాలను సులభతరం చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రతిపాదనలో చండీగఢ్ పరిపాలన, పంజాబ్, హరియాణాతో దాని సంబంధాల గురించి ఏమీ లేదు. చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. అందరినీ సంప్రదించిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాం. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే ప్రణాళిక లేదు’’ అని హోంమంత్రిత్వ శాఖ అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
కాగా కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకురావాలని కేంద్రం ఇటీవల ప్రతిపాదించింది. దీనికిగాను రాజ్యాంగ అధికరణం 131ను సవరిస్తూ బిల్లు తీసుకురానుంది. అయితే చండీగఢ్ తమ రాష్ట్రానికే చెందాలని కోరుతున్న పంజాబ్ నేతలు కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ (Congress), అకాలీదళ్ (Akali Dal) తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా స్పందిస్తూ.. భాజపా ప్రభుత్వం పంజాబ్ రాజధానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
చండీగఢ్ పంజాబ్‌దే – ఏకమైన ఆప్, కాంగ్రెస్, అకాలీదళ్
పంజాబ్, హరియాణా సంయుక్త రాజధాని చండీగఢ్ లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చేలా రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లును పంజాబ్‌లోని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది. అయితే ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ (Congress), అకాలీదళ్ (Akali Dal) తీవ్రంగా వ్యతిరేకించాయి. పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్ స్పందిస్తూ బీజేపీ ప్రభుత్వం పంజాబ్ రాజధానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చండీగఢ్ గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా పంజాబ్‌లోని విడదీయరాని భాగమని పేర్కొన్నారు. ఈ నగరాన్ని నిర్మించేందుకు తమ గ్రామాలను నాశనం చేశారన్నారు. పంజాబ్‌కు దానిపై హక్కు ఉందని వెల్లడించారు. ఆ నగరాన్ని తాము ఏమాత్రం వదులుకోమని.. అవసరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తోందని అభివర్ణించారు. నియంతృత్వం ఎదుట పంజాబ్ ఏనాడు తలవంచలేదని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా స్పందిస్తూ.. చండీగఢ్ పంజాబ్‌కు చెందినదేనని.. దానిని లాక్కోవడానికి చేసే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర భాజపా నాయకులు పంజాబ్ పక్షాన ఉంటారో.. కేంద్రం తరపున ఉంటారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అకాలీదళ్ నేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ కూడా దీనిని పంజాబ్ వ్యతిరేక బిల్లుగా అభివర్ణించారు.
కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికిగాను రాజ్యాంగ అధికరణం 131ను సవరిస్తూ బిల్లు తీసుకురానుంది. త్వరలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. చట్టసభల్లేని కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్-నికోబార్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, దమణ్-దీవ్ ప్రస్తుతం అధికరణం 240 పరిధిలో ఉన్నాయి.
Also Read : Sabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారం
