జ‌న నాయగ‌న్ ‘త‌ల‌ప‌తి’కి రూ. 220 కోట్లు..?

భార‌తీయ సినీ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం

చెన్నై : త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక న‌టుడు ర‌జ‌నీకాంత్ త‌ర్వాత త‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను ఈ మ‌ధ్య‌నే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ఇక సినిమాల‌కు గుడ్ బై చెబుతున్నాన‌ని త‌ను న‌టించిన జ‌న నాయ‌గ‌న్ చిత్ర‌మే ఆఖ‌రిది అని. త‌మిళ‌నాడులో త‌నంటే అభిమానుల‌కు చెప్ప‌లేనంత‌టి అభిమానం, ప్రేమ కూడా. వారి వెల క‌ట్ట‌లేని అభిమానం తట్టుకోలేక చివ‌ర‌కు జన నాయ‌గ‌న్ ఆడియో లాంచింగ్ ఈవెంట్ ను మ‌లేషియా రాజ‌ధాని కౌలాలంపూర్ లో పెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక అక్క‌డ కూడా ఈ ఈవెంట్ రికార్డు సృష్టించింది. మొత్తం 80 వేల మందికి పైగా ఫ్యాన్స్ హాజ‌ర‌య్యారు. దారి పొడ‌వునా ఎన్న‌డూ లేని రీతిలో కౌలాలంపూర్ వాహ‌నాల‌తో నిండి పోయింది. ట్రాఫిక్ జామ్ కిలోమీట‌ర్ల పొడ‌వునా నిలిచి పోయింది. ఈ మ‌ధ్య కాలంలో ఏ న‌టుడికి ఇంత‌టి ఫ్యాన్ ఫాలోయింగ్ లేద‌ని అక్క‌డి సినీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

ఇది ప‌క్క‌న పెడితే తాజాగా త‌ల‌పతి విజ‌య్ గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేమిటంటే జ‌న నాయ‌గ‌న్ సినిమాలో న‌టించినందుకు గాను టీవీకే విజ‌య్ కు రూ. 220 కోట్లు పారితోష‌కంగా చెల్లించిన‌ట్లు టాక్. త‌న‌తో పాటు అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే కూడా ఇందులో కీ రోల్ పోషించింది. మ‌రో స్పెష‌ల్ ఏమిటంటే బాలీవుడ్ యాక్ట‌ర్ కూడా న‌టించాడు. భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్యధికంగా రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న న‌టుడిగా విజ‌య్ రికార్డు సృష్టించాడు. ఇది ఎవ‌రూ ఊహించ‌ని విష‌యం. మొత్తం సినిమా ఖ‌ర్చు రూ. 380 కోట్లు అయ్యింద‌ని స‌మాచారంం. ఈ సినిమాకు హెచ్. వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంగీతం అందించిన ర‌విచంద‌ర్ కు రూ. 13 కోట్లు, నటుడు బాబీ డియోల్ తన పాత్రకు గాను రూ. 3 కోట్లు , న‌టి పూజా హెగ్డేకు రూ. 3 కోట్లు, మ‌ల‌యాళ న‌టి మ‌మ‌తా బైజుకు రూ. 60 ల‌క్ష‌లు చెల్లించిన‌ట్లు టాక్.

Leave A Reply

Your Email Id will not be published!