చిరాగ్ పాశ్వాన్ తో రొమాన్స్ అబద్దం : కంగనా రనౌత్
అవన్నీ పుకార్లేనంటూ కొట్టి పారేసిన నటి, బీజేపీ ఎంపీ
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు, వివాదాస్పద నటి కంగనా రనౌత్ సంచలనంగా మారారు. తను ప్రస్తుతం దివంగత రాజకీయ నేత రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ తో ప్రేమలో పడిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ఇద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై తాజాగా స్పందించారు ఎంపీ కంగనా రనౌత్. తామిద్దరం మంచి స్నేహితులమని, అంతకు మించి తామిద్దరి మధ్య రొమాన్స్ అనేది లేనేలేదని స్పష్టం చేసింది నటి. ఇదంతా ఎవరో కావాలని తనపై ప్రచారం చేస్తున్నారంటూ వాపోయింది కంగనా రనౌత్.
అయితే అగర్ ఐసా హోతా తో ఆజ్ హుమారే బచ్చే హోతే అంటూ పేర్కొన్నారు. రాజకీయ నాయకురాలుగా మారిన నటి కంగనా రనౌత్ తన తోటి రాజకీయ నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌తో తనకున్న సంబంధంపై కొనసాగుతున్న ఊహాగానాలకు పుల్ స్టాప్ పెట్టేసింది. కాగా ప్రత్యేకించి ఇద్దరూ పబ్లిక్ ఈవెంట్లలో కలిసి కనిపించారు. దీంతో అభిమానులలో మరింత ఆసక్తిని రేకెత్తించారు. అయితే, కంగనా ఇప్పుడు ఈ కబుర్లను నేరుగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా జాతీయ మీడియా ఏఎన్ ఐ ఛానల్ తో జరిగిన చిట్ చాట్ సందర్భంగా ప్రస్తావించింది. రొమాన్స్ అనేది తనతో లేదని స్పష్టం చేసింది. చిరాగ్ పాశ్వాన్ తనకు స్నేహితుడని కానీ లవర్ మాత్రం కాదన్నారు.
