ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు జైత్రయాత్రకు బబ్రేక్ వేసింది. ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ముల్లాన్ పూర్ వేదికగా కొనసాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగింది పంజాబ్ . నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 రన్స్ చేసింది. ఆడుతూ పాడుతూ టార్గెట్ ను పూర్తి చేసింది రాజస్థాన్ రాయల్స్. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 51 రన్స్ చేశాడు.
ఇందులో 7 ఫోర్లు 1 సిక్స్ కొట్టాడు. మరో ఆటగాడు డొనొవన్ ఫెరీరా 26 బాల్స్ ఎదుర్కొని 52 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 5 సిక్సులతో 43 రన్స్ చేశాడు. అంతకు ముందు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెన్ జట్టులో మార్కస్ స్టోయినిస్ 22 బంతులు మాత్రమే ఎదుర్కొని 62 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 6 సిక్సులు ఉన్నాయి. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 44 బంతుల్లో 59 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తను పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఈ సందర్బంగా పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ స్కిప్పర్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ తమ బౌలర్లు పేలవమైన ఆటతీరు వల్లనే తాము ఓడి పోవడం జరిగిందన్నాడు మ్యాచ్ పూర్తయిన అనంతరం.
