హాస్ట‌ళ్ల‌లో వార్డెన్ల‌ నియామకానికి కసరత్తు

ప్ర‌క‌టించిన మంత్రి ఎస్. స‌విత

అమ‌రావ‌తి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వచ్చే నెలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో, కొత్తగా ఏర్పాటు చేయబోయే హాస్టళ్లలో హెచ్.డబ్ల్యూ.వో.లను (వార్డెన్లు) నియామకానికి జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులు చర్యలు ప్రారంభించారని తెలిపారు మంత్రి. తమ శాఖలో సిబ్బంది కొరత కారణంగా, ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులను నియమించాలని ఆ శాఖ జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు ఓ లేఖను సైతం జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారులు రాశారు. హెచ్.డబ్ల్యూ.వో.ల (వార్డెన్లు) నియామకంపై ఇతర శాఖల అధికారులకు లేఖ రాశారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలనకు, హెచ్.డబ్ల్యూ.వోల నియామకానికి ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. కొద్ది రోజుల్లోనే హెచ్.డబ్ల్యూ.వోల నియమించేలా బీసీ సంక్షేమ శాఖాధికారులు చర్యలు ప్రారంభించారు.

స‌త్య సాయి జిల్లాలోని పెనుకొండ నియోజక వర్గంలో బీసీ విద్యార్థులకు ఉన్నతవిద్య అందించాలన్న లక్ష్యంతో మంత్రి సవిత పని చేస్తున్నారు. పేదలు, కూలీల పిల్లలు విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో నియోజక వర్గంలో కొత్తగా మూడు బీసీ హాస్టళ్లు ఏర్పాటు చేసేలా మంత్రి సవిత కృషి చేశారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, పేదరికంతో బీసీ బిడ్డల డ్రాపౌట్లు పెరుగుతున్నాయని వివరించారు. ఉన్నత విద్య చదవాలని ఉన్నా పేదరికం కారణంగా మరికొందరు బడి బయటే ఉండిపోతున్నారని తెలిపారు. మంత్రి సవిత వినతిని మన్నించి, పెనుకొండ నియోజక వర్గంలో మూడు బీసీ హాస్టళ్ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే పరిగి, రొద్దం, సోమందేపల్లిలో బీసీ హాస్టళ్లలో విద్యార్థులను చేర్చించడానికి బీసీ సంక్షేమ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులను గుర్తించి, బీసీ హాస్టళ్లలో చేర్పించాలని జిల్లాలో మండల విద్యా శాఖాధికారులను, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కోరారు. పేద, వలస కూలీల పిల్లలతో పాటు హాస్టళ్లలో ఉంటూ చదువుకోవాలని ఆస్తకి చూపే బీసీ విద్యార్థులను ఈ మూడు హాస్టళ్లలో చేర్పించేలా కృషి చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, తమ బిడ్డలను బీసీ హాస్టళ్లలో చేర్పించాలని కోరుతున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!