ఉత్కంఠ పోరులో బెంగళూరుదే విజ‌యం

ఐపీఎల్ 19వ టోర్నీ నుంచి ముంబై ఔట్

రాయ్ పూర్ : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో ప్ర‌తీ లీగ్ మ్యాచ్ ఉత్కంఠ‌కు తెర లేపుతోంది. తాజాగా రాయ్ పూ్ర వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ ఆద్యంతరం ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ పోరాటంలో చివ‌ర‌కు డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) జ‌య‌కేత‌నం ఎగుర వేసింది. ఈ గెలుపుతో పాయింట్ల ప‌ట్టిక‌లో నెంబ‌ర్ వ‌న్ స్తానంలో నిలిచింది. ఆర్సీబీ చేతిలో ప‌రాజ‌యం పాలైన ముంబై ఇండియ‌న్స్ ఇక టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ఈసారి ప్లే ఆఫ్స్ కు వ‌స్తుంద‌ని ఆశించిన ఫ్యాన్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.

స్వ‌ల్ప టార్గెట్ ఉన్న‌ప్ప‌టికీ ఆర్సీబీ ప‌రుగుల వేట‌లో తడబ‌డింది. కృనాల్ పాండ్యా 46 బంతులు ఆడి 73 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 5 సిక్స‌ర్లు ఉన్నాయి. 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయింది. స్టార్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ అద్బుత‌మైన సెల్ తో బెంబేలెత్తించాడు. త‌ను 4 ఓవ‌ర్ల‌లో 23 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులో తిల‌క్ వ‌ర్మ 42 బంతులు ఆడి 3 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 57 ర‌న్స్ చేశాడు. త‌న‌తో పాటు న‌మ‌న్ ధీర్ 32 బంతులు ఆడి 5 ఫోర్లు 2 సిక్సులు 47 ర‌న్స్ చేశాడు. దీంతో ముంబై ఇండియ‌న్స్ నిర్నీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 166 రన్స్ చేసింది.

ఇదిలా ఉండ‌గా భువ‌నేశ్వ‌ర్ కుమార్ తొలి మూడు ఓవ‌ర్ల‌లోనే ముండై ఇండియ‌న్స్ జ‌ట్టును వ‌ణికించాడు. ఆ జ‌ట్టు మూడు ఓవ‌ర్లు ముగిసే స‌రికి 3 కీల‌క వికెట్లు కూల్చాడు.

Leave A Reply

Your Email Id will not be published!