బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ : జ‌గ‌న్ రెడ్డి

వెన్నుపోటుకు, విధ్వంసానికి చిరునామా

తాడేప‌ల్లిగూడెం : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై. చంద్రబాబు రెండేళ్ల పాలన రాక్షస పాలన‌ను మించి పోయింద‌న్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు పార్టీ క్యాడ‌ర్ ను. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని రుజువయ్యిందన్నారు. వెన్నుపోటుకు, విధ్వంసానికి, అరాచకానికి, అబద్ధాలకు, డైవర్షన్‌ రాజకీయాలకు, అవినీతికి, దోపిడీ రెండేళ్ల చంద్రబాబు పాలన ప్రతిరూపంగా మారి పోయింద‌న్నారు . చంద్రబాబుకి ఓటేయడం అంటే పులి-బంగారు కడియం కథలో బాటసారి లాంటింది త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. జగన్‌ ఇచ్చేవే కావు, అంతకన్నా ఎక్కువ ఇస్తానన్నాడని, ఇప్పుడు ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని మండిప‌డ్డారు. తీరా ఓట్లు వేయించు కున్నాక చంద్రబాబు ఇప్పుడు ప్రజలను, రాష్ట్రాన్ని తినేయడం మొదలు పెట్టాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు జ‌గ‌న్ రెడ్డి.

సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌తో పాటు మొత్తం 143 రకాల హామీలు చంద్రబాబు ఇచ్చాడని, ఇప్పుడు ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడన్నారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గురించి పట్టించు కోవడం లేద‌న్నారు . ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, యాభై ఏళ్లకే పెన్షన్‌ సహా అనేక హామీలను బుట్టదాఖలు చేశారన్నారు. మేనిఫెస్టో అడ్రస్‌ కనిపించడం లేద‌న్నారు. ఈ మధ్యలో చంద్రబాబుకు బాగా బీపీ పెరిగిందంటూ ఎద్దేవా చేశారు. మావిగ‌న్ అంటే జ‌డుసుకుంటున్నాడ‌ని అన్నారు. ఆయ‌న‌ను జ‌నం న‌మ్మ‌డం లేద‌న్నారు. ఇక రాచ‌రిక పాల‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!