హైదరాబాద్ : మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఛానల్ తో జరిగిన చిట్ చాట్ లో సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం కేసీఆర్ పై. తాను విద్యాశాఖ మంత్రిగా ఉండి కేసీఆర్ ని ఎన్ని సార్లు కోరిన ఒక్క పది నిమిషాలు కూడా విద్యాశాఖ మీద చిన్న రివ్యూ కూడా చేయలేదని ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చిద్దాం అన్న కూడా వాళ్ళతో ఏంటి మాట్లాడేది అని పేడా చెవిన పెట్టే వాడని మండిపడ్డారు. పేరుకే మంత్రివర్గం అని, మంత్రులు నిర్ణయాలు అన్ని అయినే తీసుకునే వాడని, ఎవ్వరికి శాఖ పట్ల నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు కడియం శ్రీహరి.
కేసీఆర్ తెచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును నేను వ్యతిరేకించానని చెప్పారు. నేను మంత్రిగా ఉన్నంత కాలం ఆ ఫైల్ నీ అప్రూవ్ చేయలేదని స్పష్టం చేవారు. 2018 ఎన్నికల తర్వాత సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ ఇచ్చి అప్పుడు ఆ బిల్లు అప్రూవ్ చేయించుకున్నాడని ఆరోపించాడు. ప్రైవేట్ యూనివర్సిటీల మీద పెట్టిన శ్రద్ధ ఒక్క రోజు కూడా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల మీద పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చింది కూడా మల్లారెడ్డికి మల్లారెడ్డి యూనివర్సిటీ, పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనురాగ్ యూనివర్శిటీ, వరదా రెడ్డికి ఎస్ఆర్ యూనివర్శిటీ, భాస్కర్ రావుకు ఓ యూనివర్శిటీ, గురునానక్ యూనివర్సిటీ పర్మిషన్స్ ఇచ్చాడని ఫైర్ అయ్యారు కడియం శ్రీహరి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు అప్రూవ్ చేయనందుకే కేసీఆర్ ,పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరికి నామీద కోపం అన్నారు.
