న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమవేశం గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇటీవలే తమిళనాడులో సీఎంగా కొలువు తీరారు సీఎం విజయ్. ఈ కీలక సమావేశంలో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. కీలక అంశాలను లేవనెత్తారు. కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును కూడా విజయ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో విజయ్ పాల్గొనడం ఇదే మొదటిసారి. సమావేశంలో ప్రసంగించడం ద్వారా జాతీయ వేదికపై తనదైన ముద్ర వేశారు. జోసెఫ్ విజయ్ వైపు అందరి దృష్టి నిలిచింది. ఇందులో సీఎం విజయ్ కేంద్ర నిధుల కేటాయింపునకు సంబంధించిన అంశాలను లేవనెత్తడంతో పాటు ప్రాంతీయ సమస్యలను ప్రస్తావించారు .
కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును కూడా ఆయన కోరారు. అంతకు ముందు, తమిళనాడు హౌస్‌కు చేరుకున్న ఆయనకు చీఫ్ సెక్రటరీ ఎం. సాయికుమార్ , తమిళనాడు రెసిడెంట్ కమిషనర్ ఆర్. జయ స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికతను ప్రోత్సహించడం, నైపుణ్యాలను మెరుగు పరచడం , స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై ఈ నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించారు. జవాబుదారీతనం , కొలవదగిన ఫలితాలను నిర్ధారిస్తూనే… పాలన, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు , భాగస్వామ్యాల వంటి కీలక అంశాలను వినియోగించుకుని, అమలుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఉమ్మడిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారించాయి.