హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ఆమె దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. తనను రాజ్యసభకు పంపించేందుకు మధ్యప్రదేశ్ నుంచి పోటీలోకి దింపింది ఏఐసీసీ హైకమాండ్. కానీ అనుకోకుండా తను తప్పకుండా సాధించాల్సిన సీటును కోల్పోయింది ఆ పార్టీ. మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో తన కేసుకు సంబంధించి ప్రస్తావించ లేదని ఎత్తి చూపారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. దీంతో తన నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ అక్కడ కూడా తిరస్కరణకు గురైంది. సీటు గెలిచేందుకు కావాల్సిన బలం ఉన్నప్పటికీ నామినేషన్ తిరస్కరణ కారణంగా బీజేపీ ఆ సీటును కూడా గెలుపొందింది.
ముచ్చటగా మూడు సీట్లను కైవసం చేసుకుంది. ఇక్కడ ఏం జరిగిందనే దానిపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. దీంతో తన నామినేషన్ తిరస్కరణకు కారణం టీపీసీసీలోని కొందరేనని, అందుకే ఇక్కడి నుంచి ఎంపికైన రాజ్యసభ ఎంపీలలో ఒకరిని రాజీనామా చేయించాలని యోచిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఆదివారం స్పందించారు మీనాక్షి నటరాజన్. తన కోసం ఇంకొకరు తమ పదవిని వదులు కోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ రాజీనామా చేయడం లేదని కుండ బద్దలు కొట్టారు మీనాక్షి నటరాజన్. తెలంగాణ లో ఎవరు నాకోసం రాజ్యసభ స్థానం రిజైన్ చేయడం లేదని, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఖండించారు. నా రాజకీయం మధ్యప్రదేశ్ లో ఉంటుందన్నారు. మాకు ప్రతి సీటు, ప్రతి సభ్యుడు ముఖ్యమేనని పేర్కొన్నారు. దేశం కోసం అవసరమైన్నపుడే అలా జరుగుతోందని చెప్పారు. నేను ఒక్కరితో రాజ్యసభ సీటు రాజీనామా చేయించి తీసుకునే అవసరం నాకు లేదని కుండ బద్దలు కొట్టారు.