జ‌గ‌న్ మాట్లాడేవ‌న్నీ అబ‌ద్దాలే : కేశినేని శివ‌నాథ్

మాజీ సీఎం పై ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

విజ‌య‌వాడ : టీడీపీ విజ‌య‌వాడ ఎంపీ , ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న బెజ‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. ఆయ‌న మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. త‌ను చేసేవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని పేర్కొన్నారు. త‌న‌ను ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌న్నారు. అందుకే వైసీపీని అడ్ర‌స్ లేకుండా చేశార‌ని , అయినా బుద్ది రావ‌డం లేద‌న్నారు ఎంపీ. ఫేక్ ప్ర‌చారాల‌కు పెట్టింది త‌న పార్టీ అని ఎద్దేవా చేశారు. త‌న పార్టీని 11 సీట్ల‌కే ప‌రిమితం చేసినా మార‌క పోతే ఎలా అని ప్ర‌శ్నించారు ఎంపీ కేశినేని శివ‌నాథ్. ఏపీ లో కూట‌మి స‌ర్కార్ పాల‌న‌ను చూసి ఓర్వ‌లేక పోతున్నార‌ని, అందుకే అస‌త్య ప్ర‌చారాల‌కు తెర లేపారంటూ ధ్వ‌జ‌మెత్తారు. జ‌గ‌న్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక‌, ఛాన‌ల్ ప‌నిగ‌ట్టుకుని అబ‌ద్దాల‌తో కూడిన వార్త‌ల‌ను ప్ర‌చురించ‌డం, ప్ర‌సారం చేయ‌డం చేస్తూ వ‌చ్చార‌ని ఆరోపించారు కేశినేని శివ‌నాథ్.

పోల‌వ‌రంలో క‌ట్ట‌ప్ప‌ల లూటీ పేరుతో వ‌చ్చిన వార్త స‌త్య దూర‌మ‌న్నారు. ఇందులో ఎలాంటి వాస్త‌వం లేద‌న్నారు. ఎవ‌రు ఏం చేశారో , చేస్తున్నారో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌న్నారు. లారీల‌లో ఉన్న పేరు జీటీఆర్ అని ఉంద‌ని, వాటి వెనుక ఎవ‌రు ఉన్నారో చెప్పాల్సిన బాధ్య‌త మీపై లేదా అని ప్ర‌శ్నించారు ఎంపీ. 2023 లో ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోతే, హైకోర్టులో ఒక కేసు కూడా ఫైల్ అయిందని చెప్పారు. 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పోలవరం కుడి కాలువ వల్ల దోచేశారని ఆరోపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసు 2022 లోనే ఫైల్ అయ్యింద‌ని, దాని గురించి తెలుసు కోకుండా ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా అని నిల‌దీశారు కేశినేని శివ‌నాథ్. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో, మరి ఆ రోజు ఎంపీ ఎవరో, మరి ఆ రోజు మనుషులు ఎవరో మీకే తెలియాలి అని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!