కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుంది : లోకేష్

అవనిగడ్డ కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్

అమ‌రావ‌తి : గొడ్డ‌లి పార్టీ నేత‌లు, గ‌త ప్ర‌భుత్వంలో బూతు మంత్రులు కృష్ణా జిల్లా ప‌రువు ఎలా తీశారో, ప్ర‌స్తుతం విష ప్ర‌చారాలు ఎలా చేస్తున్నారో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సిన బాధ్య‌త కేడ‌ర్‌పై ఉంద‌ని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మోపిదేవిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడారు. మహనీయులు జన్మించిన ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో బూతుల మంత్రి ఉండేవారు, ఒకడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవాడు. మరొకడు భువనేశ్వరమ్మను అవమానించేవాడు. నేను ఆనాడే చెప్పా, వారి పేర్లు ఎర్రబుక్కులో రాస్తున్నా అని. వారి విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు, రెడ్ బుక్ తన పని తాను చేస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉమ్మడి కృష్ణాజిల్లా, ఎన్టీఆర్ జన్మించిన నేల ఇది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అవ‌నిగ‌డ్డ‌లో ఆరుసార్లు టిడిపి, ఒకసారి కూటమి విజయం సాధించాయి. తెలుగుదేశం కార్యకర్తల రెక్కల కష్టంతోనే ఇది సాధ్యమైందని అన్నారు.

కడపలో గతఏడాది మహానాడులో ఐడియాలజీలో మార్పు కోసం ఆరుశాసనాలు తీసుకున్నాం. అందులో తొలి శాసనం కార్యకర్తే అధినేత. మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజున జాతీయ అధ్యక్షుడి పక్కన టిడిపి సాధారణ కార్యకర్తలు కూర్చున్నారు. మార్పు మనవద్ద నుంచే మొదలు కావాలి. మనం ఎవరం శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. వ్యవస్థను బలోపేతం చేసేందుకు అందరం అహర్నిశలు కష్టపడాలి. తోట చంద్రయ్యను గత ప్రభుత్వంలో ప్రత్యర్థులు వారి నాయకుడికి జైకొట్టమని మెడపై కత్తిపెడితే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు. గొడ్డలిపార్టీ అడ్డంకులు సృష్టించినా చట్టాన్ని సవరించాం. తోట చంద్రయ్య కుమారుడికి శాశ్వత ఉద్యోగం ఇచ్చాం. ఒక అంజిరెడ్డి తాత, మంజుల , విజయవాడలో చెన్నుపాటి గాంధీ, అనేక ప్రత్యర్థులతో అనేక అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నారు, అయినా ఎదురొడ్డి నిలబడ్డారు. గత అరాచక పాలనలో చంద్రబాబును సైతం జైలుకు పంపారు, నాపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీతో సహా 23 కేసులు పెట్టారు. త‌గ్గ‌కుండా అంతా క‌లిసి పోరాడాం. అధికారంలోకి వ‌చ్చాం. ప్రతిపక్షంలో ఉన్నపుడు పోరాడతాం, యుద్ధం చేస్తాం. అధికారంలోకి వచ్చాక రిలాక్స్ అయిపోతాం. కష్టకాలాన్ని మర్చిపోకూడదు. చిన్నపాటి పొరపాటు జరిగినా అలిగి ఇంట్లో పడుకుంటున్నారు. ఇది కోవిద్ కన్నా ప్రమాదకరమైన జబ్బు. దానివల్ల నష్టపోయేది తెలుగుదేశం పార్టీ, ఆంధ్రరాష్ట్ర ప్రజలు అని హెచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!