నెల్స‌న్ దిలీప్ కుమార్ వెరీ వెరీ స్పెష‌ల్

అంద‌రి క‌ళ్లు ర‌జ‌నీకాంత్ జైల‌ర్ -2 పైనే

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ భార‌త దేశ సినిమాకు అత్య‌ధికంగా క‌థ‌ల‌ను అందిస్తోంది. ప్ర‌త్యేకించి అత్యంత ప్ర‌తిభావంత‌మైన క‌థక‌లు, సృజ‌నాత్మ‌క‌త‌తో కూడిన ద‌ర్శ‌కులు, న‌టీ న‌టులు క‌లిగి ఉన్నారు. ఇక చాలా త‌క్కువ స‌మ‌యంలోనే త‌మ‌దైన రీతిలో సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాకుండా అత్యంత పాపుల‌ర్ గా, మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుల జాబితాలోకి చేరి పోయాడు నెల్స‌న్ దిలీప్ కుమార్. త‌ను ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాదు క‌థా ర‌చ‌యిత‌, నిర్మాత‌, డార్క్ కామెడీ, యాక్షన్, స్టైలిష్ స్క్రీన్‌ప్లేకు ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయ‌న జూన్ 21, 1984లో త‌మిళ‌నాడులోని వెల్లూరులో పుట్టాడు. చెన్నైలోని ది న్యూ కాలేజీలో విజువ‌ల్ క‌మ్యూనికేష‌న్స్ లో శిక్ష‌ణ పొందాడు. ఆ త‌ర్వాత త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే పిచ్చి. వాటిని చూస్తూ పెరిగాడు. ఇక టేకింగ్ లో మేకింగ్ లో త‌న‌దైన శైలిలో సినిమాల‌ను తీయ‌డం మొద‌లు పెట్టాడు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా తీసేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు. దీంతో స‌క్సెస్ వాటంత‌ట అవే వ‌చ్చేలా చేశాయి.

త‌న‌క‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. నెల్స‌న్ దిలీప్ కుమార్ సినిమాల్లోకి రాకముందు టెలివిజన్‌లో స్క్రిప్ట్ రైటర్, షో డైరెక్టర్‌గా పనిచేశారు. మొదటి ప్రాజెక్ట్ వెట్టై మ‌న్నం మధ్యలోనే ఆగిపోయినా తర్వాత వచ్చిన సినిమాలతో స్టార్ దర్శకుడిగా ఎదిగారు. తొలి చిత్రం కొల‌మావు కోకిల‌, 2021లో తాను తీసిన డాక్ట‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్ర‌స్తుత సీఎంగా ఉన్న విల‌క్ష‌ణ న‌టుడు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ , మాళ‌విక మోహ‌న్ తో క‌లిసి 2022లో బీస్ట్ తీశాడు. ఇది త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బిగ్ హిట్ గా నిలిచింది. 2023లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ , శివ‌రాజ్ కుమార్, త‌మ‌న్నాతో క‌లిసి జైల‌ర్ తీశాడు. ఇది రికార్డుల మోత మోగించింది. కాసుల వ‌ర్షం కురిపించింది. దీంతో సీక్వెల్ గా జైల‌ర్ -2 తీస్తున్నాడు. ఇది అక్టోబ‌ర్ 15న రానుంది ప్ర‌పంచ వ్యాప్తంగా. ఎన్నో అవార్డుల‌ను స్వంతం చేసుకున్న నెల్స‌న్ దిలీప్ కుమార్ ఏం మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Leave A Reply

Your Email Id will not be published!