అహ్మ‌దాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరి శిక్ష

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న గుజ‌రాత్ కోర్టు

గుజ‌రాత్ : దేశ వ్యాప్తంగా సంచ‌లనం రేపిన అహ్మ‌దాబాద్ పేలుళ్ల కేసులో సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది గుజ‌రాత్ హైకోర్టు. 2008 అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల కేసులో తీర్పు చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది. 38 మందికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్ప‌డం విస్తు పోయేలా చేసింది. ఈ నిర్న‌యాన్ని కింది కోర్టు తీర్పును సమర్థించింది హైకోర్టు. 11 మందికి జీవిత ఖైదు విధించింది. దోషులకు మరణశిక్ష‌తో పాటు మరో 11 మందికి జీవిత ఖైదును నిర్ధారిస్తూ గుజరాత్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. భారతదేశంలోని అతిపెద్ద ఉగ్రవాద కేసుల్లో ఒక మైలురాయిగా తీ తీర్పును పేర్కొంటున్నారు.

కేసుకు సంబంధించి ప‌లు వాద‌న‌లు చోటు చేసుకున్నాయి కోర్టు ప్రాంగ‌ణంలో. కింది కోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది గుజ‌రాత్ హైకోర్టు ధ‌ర్మాస‌నం. 38 మంది దోషులకు ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు మంగళవారం ఖరారు చేసింది. ఈ కేసులో దాఖలైన అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించడం చ‌రిత్రాత్మ‌క తీర్పు ఇచ్చింది.

2008, జులై 26న అహ్మదాబాద్‌లో కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల బాంబు దాడులతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 56 మంది మరణించారు, 246 మంది తీవ్ర గాయపడ్డారు. ఆ తర్వాత సూరత్‌లో పేలని బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 78 మందిపై విచారణ జరగగా, 2022లో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా తేల్చి, 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!