వయ‌నాడు ఘ‌ట‌న బాధాక‌రం : రాహుల్ గాంధీ

బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న

కేర‌ళ : కేర‌ళ‌లోని త‌మ ప్ర‌భుత్వం వ‌య‌నాడు లో కొండ చ‌రియ‌లు విరిగి ప‌డిన ఘ‌ట‌న‌కు సంబంధించి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ప్ర‌క‌టించారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, అమేధి ఎంపీ రాహుల్ గాంధీ. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సహాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన వార్త తీవ్ర ఆవేదన కలిగించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇంకా చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను. బాధితులందరికీ నా సంఘీభావం, ప్రార్థనలు ఉంటాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, చిక్కుకు పోయిన వారిని చేరడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ క్లిష్ట సమయంలో సాధ్యమైనంత సహాయం అందించాలని కాంగ్రెస్, UDF కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. వయనాడ్ గతంలో కూడా విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంది, ఈ విషాద సమయంలో బాధితులైన ప్రతి కుటుంబానికి మనం అండగా నిలబడతాము అని గాంధీ అన్నారు. వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఒక పోస్ట్‌లో మాట్లాడుతూ, కొండ చరియల ఘటనలో చిక్కుకు పోయిన వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు , ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు ఇప్పటికే ఘటనా స్థలంలో ఉన్నాయి, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు , సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు కూడా అక్కడికి చేరుకున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!