న్యూఢిల్లీ : దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. 179 బిలియన్ డాలర్ల ప్రపంచ మార్కెట్లో 25% వాటాను దక్కించుకోవాలని భారతీయ బొమ్మల తయారీదారులను కోరారు . బొమ్మల తయారీని ప్రోత్సహించడానికి , చైనా వంటి దేశాల నుండి దిగుమతులపై ఆధార పడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి బొమ్మల పరిశ్రమ అపారమైన వృద్ధి సామర్థ్యాన్ని ఉటంకిస్త కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. 2032 నాటికి 179 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేయబడిన ప్రపంచ బొమ్మల మార్కెట్ వాటాలో కనీసం నాలుగో వంతును దక్కించు కోవాలని భారతీయ తయారీదారులను కోరారు. 2025-26 నాటికి భారతదేశం 153 దేశాలకు బొమ్మలను ఎగుమతి చేస్తుందని, వాటి విలువ 186 మిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు.
అయితే 2019-26 మధ్య దిగుమతులు 71 శాతం మేర గణనీయంగా తగ్గాయని కూడా మంత్రి తెలిపారు. 2034 నాటికి భారతదేశపు బొమ్మల మార్కెట్ 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేయగా, ప్రపంచ బొమ్మల మార్కెట్ 2032 నాటికి 179 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది అని ఇక్కడ జరిగిన అంతర్జాతీయ బొమ్మల ప్రదర్శనలో ప్రసంగిస్తూ నిర్మలా సీతారామన్ అన్నారు. మనం ఇప్పటికీ 2034 నాటికి కేవలం ఐదు బిలియన్ డాలర్లను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నాము. మనం ఇంతకంటే చాలా మెరుగ్గా చేయగలమని నేను భావిస్తున్నాను. మనం అంది పుచ్చుకోవడానికి అపారమైన సామర్థ్యం ఉందన్నారు.
