మెగా డీఎస్సీ స్కాంలో నారా లోకేష్ పాత్ర : దేవినేని

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన వైఎస్సార్సీపీ

విజయవాడ: మెగా డీఎస్సీ (జిల్లా ఎంపిక కమిటీ) నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపించ బడుతున్న అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు శుక్రవారం విజయవాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ నియామక ప్రక్రియను ఆ పార్టీ ఎమ్మెల్సీ రుహుల్లా భారీ కుంభకోణంగా అభివర్ణించారు, అలాగే అడ్డదారిలో ఉద్యోగాల అమ్మకాలు జరిగాయి అని ఆరోపించారు. డీఎస్సీ నియామకం ఒక భారీ కుంభకోణం. అడ్డదారిలో ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. నైతిక కారణాలతో కేంద్ర మంత్రి ఒకరు రాజీనామా చేసినట్లే, నారా లోకేష్ కూడా విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయల‌ని రుహుల్లా స్పష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రభుత్వం వాడుతున్న పదజాలంపై మండిపడ్డారు.

మెగా డీఎస్సీ అనేది వాస్త‌వానికి ద‌గా అని పేర్ఒక‌న్నారు. ఇది మెగా డీఎస్సీ కానే కాద‌ని ఇది ద‌గా డీఎస్సీ అని పేర్కొన్నారు. డీఎస్సీ నియామ‌కాల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లకు స‌మాధానం చెప్ప‌కుండా స‌ర్కార్ దాట‌వేత ధోర‌ణి అవ‌లంభించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. విచిత్రం ఏమిటంటే వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణ‌మ‌న్నారు అవినాష్. మోస పోయిన బాధితులు, యువత నారా లోకేష్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు అని పేర్కొన్నారు. నియామకాల్లోని క్రీడా కోటాలో కూడా భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. నియామకాల్లో క్రీడా కోటాలో అక్రమాలు జరిగాయి. బంగారు పతకాలు సాధించిన అభ్యర్థులకు డీఎస్సీలో అవకాశాలు నిరాకరించారని ఆరోపణలు ఉన్నాయన్నారు. కేవలం క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉంటే, సీబీఐ విచార‌ణ చేప‌ట్టేందుకు ఎందుకు భ‌య‌పడుతోంద‌ని ప్ర‌శ్నించారు.

Leave A Reply

Your Email Id will not be published!