విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చేపట్టింది. పలువురు సీనియర్ అధికారులను కీలక శాఖలకు బదిలీ చేయడంతో పాటు, మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 1992 బ్యాచ్ కు చెందిన షంషేర్ సింగ్ రావత్ కు పర్యాటక , సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయనకు అదనంగా యూత్ సర్వీసెస్ , స్పోర్ట్స్, సర్వీసెస్, హెచ్ఆర్ఎం, జీపీఎం, ఏఆర్ శాఖలు అప్పగించారు. 1997 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్యామల రావుకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఆయనకు అదనంగా ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి , శిక్షణ, పొలిటికల్-జిఏడీ బాధ్యతలు ఇచ్చారు. 2003 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కోన శశిధర్ ను రవాణా, రోడ్లు , భవనాల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ , ఇన్వెస్ట్మెంట్ శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు సీఎస్.
2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎం. శివప్రసాద్ కీలకమైన ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది. దీంతో పాటు అదనంగా ఎస్జీ, ఎస్ డబ్ల్యూ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది. అమ్రపాలి కాటాకు కోలుకోలేని షాక్ తగిలింది. తనను ఏపీ పర్యాటక శాఖ ఎండీ బాధ్యతల నుంచి తప్పించింది. తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. 2013 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన పట్టన్ శెట్టి రవి సుభాష్ కు ఏపీటీడీసీ ఎండీగా నియమించింది. అదనంగా ఏపీటీఏ సీఈఓగా, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఇద్దరు అధికారులను నియమించింది ఎస్. సురేష్ కుమార్ కు ప్రత్యేక అధికారిగా , డాక్టర్ నారాయణ భరత్ గుప్తాకు జాయింట్ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగించింది.
పురావస్తు, మ్యూజియంల కమిషనర్ గా ముత్యాల రాజు రేవు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ గా కేవీఎఎన్ చక్రధర్ బాబును నియమించింది. నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హెఫ్సిబా రాణి కొర్లపాటిని నియమించింది. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా , ఏపీ వీకర్ సెక్షన్స్ హౌసింగ్ ప్రోగ్రామ్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ గా పి. అరుణ్ బాబుకు అప్పగించగా వీఎంఆర్డీఏ కమిషనర్ బాధ్యతల నుంచి తేజ్ భరత్ ను తప్పించారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) మెట్రోపాలిటన్ కమిషనర్ గా ప్రఖర్ జైన్ , ఆర్టీజీఎస్ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు గీతాంజలి శర్మకు. డిజాస్టర్ మేనేజ్మెంట్ఎ , క్స్-అఫీషియో డిప్యూటీ సెక్రటరీగా చేతన్ టీఎస్ కు ఇచ్చారు.
టీటీడీ జేఈవోగా డాక్టర్ శరత్ కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. ప్రభల గోపీనాథ్ కు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ జేఏఈవోగా నియమించారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవోగా పద్మావతి, టుడా కమిషనర్ గా ఎం. జయకృష్ణ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బాధ్యతల నుంచి అనిల్ కుమార్ రెడ్డిని తప్పించారు. బి. సునీల్ కుమార్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
