హైదరాబాద్ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) దూకుడు పెంచింది. సైబరాబాద్ పరిధిలో పాదచారుల కోసం బహిరంగ స్థలాలను కల్పించేలా 290 ఆక్రమణలను తొలగించింది. సైబరాబాద్‌లో మొత్తం 14.1 కిలోమీటర్ల మేర ఉన్న ఆక్రమణలను తొలగించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మూడు జోన్లలోని గుర్తించిన ప్రాంతాలలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది, తద్వారా రోడ్లు, ఫుట్‌పాత్‌లు , బహిరంగ స్థలాలను ప్రజల వినియోగం కోసం తిరిగి స్వాధీనం చేసుకుంది. తమ ‘వాక్-ఫ్రీ’ (పాదచారులకు అనుకూలమైన నడక మార్గాల కల్పన) కార్యక్రమంలో భాగంగాసైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. మూడు జోన్లలోని గుర్తించిన ప్రాంతాలలో ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టింది. దీనివల్ల రోడ్లు, ఫుట్‌పాత్‌లు , బహిరంగ స్థలాలు పాదచారులకు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 14.1 కిలోమీటర్ల పరిధిలో 290 ఆక్రమణలను తొలగించారు.
నార్సింగి, అమీన్‌పూర్, మియాపూర్ , శేరిలింగంపల్లి ప్రాంతాలు కలిగిన శేరిలింగంపల్లి జోన్‌లో 84 ఆక్రమణలను తొలగించారు. మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి , మూసాపేట ప్రాంతాలు కలిగిన కూకట్‌పల్లి జోన్‌లో 55 ఆక్రమణలను తొలగించారు. అలాగే, చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గజలరామారం, నిజాంపేట, దుండిగల్ , మేడ్చల్ ప్రాంతాలు కలిగిన కుత్బుల్లాపూర్ జోన్‌లో సుమారు 150 ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణల తొలగింపుతో పాటు, తిరిగి ఆక్రమణలు జరగకుండా చూసేందుకు, స్వాధీనం చేసుకున్న బహిరంగ స్థలాలను ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచేందుకు సీఎంసీ బృందాలు ఆయా ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. రోడ్లు , ఫుట్‌పాత్‌లను అందరికీ అందుబాటులో, సురక్షితంగా, ఆక్రమణలు లేకుండా ఉంచడం ద్వారా ‘వాక్-ఫ్రీ’ వాతావరణాన్ని కల్పించే ఈ కార్యక్రమం సైబరాబాద్ అంతటా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
