సంస్థాగ‌త ప‌రంగా బ‌లోపేతంపై ఎన్సీపీ ఫోక‌స్

ప్ర‌శాంత్ కిషోర్ తో ప్ర‌త్యేక భేటీ

ముంబై : మ‌హారాష్ట్రంలో త‌మ పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించింది ఎన్సీపీ. ఈ మేర‌కు పార్టీ నేత‌లు సునేత్రా పవార్, పార్త్‌లతో ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త , జ‌న్ సుర‌క్ష పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరేలా చూడటమే ఈ అంతర్గత సమావేశం ఉద్దేశమని పార్టీ ప్రతినిధి చవాన్ తెలిపారు. రాజకీయ వ్యూహకర్తగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ఇ టీవల పాట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించారు. ఇప్పుడు మహారాష్ట్ర అధికార పార్టీ అయిన ఎన్ సీపీని సంస్థాగతంగా బలోపేతం చేసే మార్గాలపై పార్టీ అధ్యక్షురాలు, ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్‌తో ఆయన చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘

జన్ సురాజ్ పార్టీ’ అధినేత అయిన కిషోర్, దక్షిణ ముంబైలోని సునేత్రా పవార్ అధికారిక నివాసం ‘దేవగిరి’లో ఆమెతో సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణపై సలహాలు ఇస్తున్న కిషోర్, సునేత్రా పవార్, ఆమె కుమారుడు (ఎంపీ) పార్త్ పవార్, సీనియర్ నాయకులతో ఈ సమావేశం జరిగిందని ఎన్సీపీ ప్రతినిధి సూరజ్ చవాన్ తెలిపారు. పార్టీని బలోపేతం చేయడం , ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరేలా చూడటంపై చర్చించడానికి ఇది ఒక అంతర్గత సమావేశం అని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే పనితీరుపై కిషోర్ అసంతృప్తి వ్యక్తం చేశారని, ఆయనను తొలగించాలని కోరారని వస్తున్న ఊహాగానాలను చవాన్ తోసిపుచ్చారు.

నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ నుండి అరవింద్ కేజ్రీవాల్ వరకు అనేక మంది నాయకుల ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్ర‌శాంత్ కిషోర్ సునేత్రా పవార్‌ను కలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆమె భర్త, అప్పటి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన తర్వాత వారు కలుసుకోవడం గమనార్హం. కొన్ని నెలల క్రితం జరిగిన వారి మొదటి సమావేశం తర్వాత, కిషోర్ తమ కుటుంబానికి సుపరిచితులేనని పార్త్ పవార్ పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!