స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తి

మ‌హిళా సాధికార‌త‌కు ద‌ర్ప‌ణంగా నిలిచింది

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల కోసం తీసుకు వ‌చ్చిన స్త్రీ శ‌క్తి ఉచిత బ‌స్సు ప‌థ‌కం ఆగ‌స్టు 15వ తేదీతో ఏడాది పూర్త‌యింది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ప్రారంభించింది. స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేప‌ట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. రాజధానిలోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో బస్సులో ప్రయాణం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వ‌హించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ మీదుగా సీఎం క్యాంప్ కార్యాలయం వరకు బస్సులో మహిళలతో కలిసి వ‌చ్చారు. స్త్రీ శక్తి పథకం అమలు తీరు తెన్నులను మహిళలను అడిగి తెలుసుకున్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

మహిళల కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. ఓ మహిళ రైతుతో సంభాషించారు. ప్రభుత్వం అంచేదించే పథకాలను అంది పుచ్చుకోవాలని సూచించారు. చేపలు అమ్ముకునే ఓ మహిళతో మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం ద్వారా తనకు నెలకు రూ. 4 వేలు ఆదా అవుతున్నాయని తెలిపింది మత్స్యకార మహిళ. త‌న‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. తనకు చక్కెర వ్యాధి ఉందని… తనకు ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లబ్దితో మందులు కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటే అనారోగ్యం దరిచేరదని సూచించారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటే సంపాదనను మందుల కొనుగోలు ఖర్చులను ఆదా చేసుకోవచ్చని చెప్పారు ముఖ్యమంత్రి.
స‌
స్త్రీ శక్తి పథకం వల్ల తనకు నెలకు రూ. 1500 ఆదా అవుతుందని తెలిపిన నంద్యాల నుంచి వచ్చింది ముస్లిం మహిళ. స్త్రీ శక్తి పథకం సహా తనకు మొత్తంగా నాలుగు పథకాలు అందుతున్నాయని తెలిపింది. విద్యార్థినులకు స్త్రీ శక్తి పథకం చాలా ఉపయోగంగా ఉందని చెప్పింది. స్త్రీ శక్తి పథకంతో పాటు.. నేతన్న సేవలో పథకం ద్వారా మరింత ఆదాయం వస్తుందని తెలిపిన ఉమ్మడి అనంతపురానికి చెందిన చేనేత మహిళ. ముడి సరుకు తెచ్చేందుకు నేసిన చీరలను షాపులకు మార్కెటింగ్ చేసేందుకు స్త్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణిస్తున్నామని తెలిపింది ఓ మ‌హిళ‌. గతంలో తన భర్త ఒక్కరే బయటకు వెళ్లి వ్యాపారం చేసేవారని, ఇప్పుడు తాను కూడా బయటకు వెళ్లి వ్యాపారాభివృద్ధి కోసం పని చేయగలుగుతున్నామని చెప్పింది. సంకల్పంతో పని చేయాలని తనతో కలిసి ప్రయాణిస్తున్న మహిళలకు సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!