కాంగ్రెస్ స‌ర్కార్ కు రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి : కేటీఆర్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

క‌రీంన‌గ‌ర్ జిల్లా : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌స్తుత కాంగ్రెస్ స‌ర్కార్ పై. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఏకి పారేశారు. ఆయ‌నకు అంత సీన్ లేద‌న్నారు. పాల‌న గాడి త‌ప్పింద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం లేద‌ని కేవ‌లం రియ‌ల్ దందా కొన‌సాగుతోంద‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. సిరిసిల్ల‌లో ప‌ర్య‌టించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ జోష్యం చెప్పారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించిన ‘యువ సమరభేరి’లో ప్రసంగించారు. మంత్రివర్గం నుండి ఒక మంత్రిని తొలగించడం సరిపోదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గద్దె దించే రోజులు త్వరలోనే వస్తాయని రామారావు అన్నారు. సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముచ్చటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పతనం తథ్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే పేదల భూములను ’22A’ నిషేధిత జాబితాలో చేర్చి, కోట్లాది రూపాయల విలువైన ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జీవో 97 (GO 97) గురించి ప్రస్తావిస్తూ విలువైన భూములను చేజిక్కించు కునేందుకే ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలను కార్మిక శాఖ పరిధిలోకి తీసుకు వచ్చిందని ఆయన ఆరోపించారు. గత నెల రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ జీవోకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ, ఏ మంత్రి లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యే వారికి మద్దతు ఇవ్వలేదని రామారావు విమర్శించారు. తామ, ఇతర బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని, జీవో 97 జారీ వెనుక ఉన్న అసలు కారణాలను బయటపె డతామని కేటీఆర్ చెప్పారు. జీవో 97 రద్దయ్యే వరకు, విద్యార్థుల సమస్య పరిష్కారమయ్యే వరకు బీఆర్‌ఎస్ వారికి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!