నిజాయితీకి నిలువుట‌ద్దం సీఎం చంద్రబాబు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : మూడేళ్ల కిందట ఇదే రోజు నీతి, నిజాయితీకి నిలువుటద్దమైన సీఎం చంద్రబాబు నాయుడును ఆనాటి వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో నిర్బంధించిందని, కోర్టులు, ప్రజలే కాకుండా మొత్తం ప్రపంచమే ఆయనకు అండగా నిలిచిందని, చివరికి కడిగిన ముత్యంలా అక్రమ కేసుల నుంచి బయట పడ్డారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. తన రాజకీయ జీవితంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడూ అవినీతి, అక్రమాలకు పాల్పడలేదన్నారు. అటువంటి నేతపై కక్షసాధింపులకు పాల్పడిన వైసీపీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టారన్నారు. 2023 ఇదే రోజున సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఘటనను గుర్తు చేసుకుంటూ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నేతృత్వంలో కూటమి నాయకులు, మహిళలు కొవ్వొత్తులు వెలిగించారు. సీఎం చంద్రబాబు నాయకత్వం వర్ధాల్లాలి, నిజమే గెలిచిందంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంతా మంత్రి సవిత మాట్లాడుతూ తన అసమర్థ పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో పాటు సీఎం చంద్రబాబుకు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజామద్దతను చూసి జగన్ ఓర్వలేక పోయారన్నారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏనాడూ అవినీతి, అక్రమాలను పాల్పడని సీఎం చంద్రబాబుపై ఆనాడు తప్పుడు కేసులు పెట్టి జైల్లో 53 రోజులను బంధించారన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఏక కంఠంతో ఖండించారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన తెలియ జేశారన్నారు. చివరికి కోర్టులు సైతం సీఎం చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని తీర్పునివ్వడంతో, జగన్ పెట్టిన తప్పుడు కేసుల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకొచ్చారన్నారు. ఎప్పటికైనా నిజం, ధర్మమే గెలుస్తుందని సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టు రుజువు చేసిందన్నారు.

జగన్ ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా, అక్రమంగా జైల్లో నిర్బంధించినా వెనుకంజ వేయలేదని, ప్రజల పక్షానే సీఎం చంద్రబాబు నిలిచారని అన్నారు. 53 రోజుల పాటు చంద్రబాబు విడుదల కోసం పరితపించిన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు, విదేశాలకు చెందిన‌ ఎన్ఆర్ఐలకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు . రాజకీయాల్లో కక్షసాధింపులకు తావేలేదన్నారు. చింత చచ్చినా పులుపు చావనట్లు ప్రజలు గుణపాఠం చెప్పినా, జగన్ బుద్ధి మారడం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పోతున్న జగన్ తన నీలి మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురిస్తూ విషం కక్కుతున్నారన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!