చంద్ర‌బాబూ అమ‌రావ‌తిని బంగారంతో క‌డుతున్నావా..?

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆయ‌న సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. అమ‌రావ‌తి రాజ‌ధాని పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడంటూ మండిప‌డ్డారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. అమరావతిలో నీ ‘కలెక్షన్‌ రేటు’, నీ “కరప్షన్‌ రేటు’’ అదిరిందయ్యా అంటూ ఎద్దేవా చేశారు. ఎస్ఎఫ్‌టీకి రూ. 30 వేలు నిర్ణ‌యించ‌డం దారుణ‌మ‌న్నారు. అమ‌రావ‌తిని ఏమైనా బంగారంతో క‌డుతున్నావా అని నిల‌దీశారు. 2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం రూ.2,271 కోట్లు మాత్ర‌మేన‌ని, కానీ 2024లో అధికారంలోకి రాగానే టెండర్ల రద్దు చేశార‌ని ఆరోపించారు. దీని స్థానంలో భారీగా అవే బిల్డింగులకు అంచనాల పెంచుకుంటూ పోయార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు జ‌గ‌న్ రెడ్డి. 2025 ఏప్రిల్‌లో మళ్లీ అవే కంపెనీలకు, అవే పనులు అప్ప‌గించ‌డం వెనుక మ‌త‌లబు ఏమిటో చెప్పాల‌న్నారు.
.
ఈసారి కాంట్రాక్టు విలువ ఏకంగా రూ.4,689 కోట్లకు పెంచార‌ని బాబుపై భగ్గుమ‌న్నారు. ఇప్పుడు మళ్లీ అవే పనులకు, మళ్లీ అంచనాల పెంచార‌ని, మొత్తం విలువ రూ.6,641 కోట్లుగా మారింద‌న్నారు. దీనికి అదనంగా అద్దాలు, ఏసీలు సహా ఇతర పనులకు మరో రూ.4,830 కోట్లు అవుతాయ‌ని అంచ‌నా వేశార‌న్నారు▪️ఇప్పటికి ఆ 5 భవనాలు, 52.20 లక్షల SFT నిర్మాణ వ్యయం రూ.15,317 కోట్లు అని ఇదంతా ఎవ‌రి సొమ్ము ఎవ‌రికి చేరుతుందో చెప్పాల్సిన బాధ్య‌త సీఎంపై ఉంద‌న్నారు. ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, NAC ఛార్జీల మినహాయింపు ఇవ‌న్నీ ఉండ‌గా ఎస్ఎఫ్టీ రేటు ఇంత‌లా ఎందుకు పెంచార‌ని ప్ర‌శ్నించారు. దీని వెనుక జ‌రిగిన లావాదేవీల గురించి కూడా చెప్పాల‌న్నారు. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్‌ సదుపాయాలతో కూడా SFTకి రూ.5 వేలు మించి లేదన్నారు. మ‌రి అమ‌రావ‌తిలో ఈ స్పెష‌ల్ ధ‌ర‌లు ఏమిటి..ఎవ‌రి కోసం వీటిని మార్చారో చెప్పాల‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

Leave A Reply

Your Email Id will not be published!