వాషింగ్టన్ : ఐఫోన్ వినియోగదారులారా జాగ్రత్త అంటూ హెచ్చరించింది వినియోగదారులు. ఒక్క వెబ్సైట్ సందర్శన మీ వ్యక్తిగత డేటాను ప్రమాదంలో పడేయవచ్చు అని పేర్కొన్నారు. పాతబడిన సాఫ్ట్‌వేర్‌తో నడుస్తున్న పరికరాలను లక్ష్యంగా చేసుకుని పొంచి ఉన్న భద్రతా పరమైన ముప్పుల గురించి ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించారు. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్, వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో పడేయగల దాడుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తమ పరికరాలను అందుబాటులో ఉన్న తాజా iOS వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలని ఆయన వినియోగదారులను కోరారు. హానికరమైన వెబ్సైట్ల ద్వారా హ్యాకర్లు ఐఫోన్లను లక్ష్యంగా చేసుకోవచ్చు.
పావెల్ దురోవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఒక పోస్ట్ ద్వారా భద్రతా హెచ్చరిక జారీ చేశారు. ఆపిల్ ఐఓఎస్ పాత వెర్షన్లతో నడుస్తున్న ఐఫోన్లు హ్యాకింగ్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దురోవ్ ప్రకారం భద్రతాపరమైన ముప్పులను ఎదుర్కోవడానికి వినియోగదారులు అనుమానాస్పద అప్లికేషన్లను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండక పోవచ్చు. కేవలం ఒక హానికరమైన వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా రక్షణ లేని పరికరం సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంది.
పాత సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు ఐఫోన్లలో నిల్వ ఉన్న సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయగలరని ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరిక, క్రమం తప్పకుండా సాఫ్ట్వేర్ అప్డేట్లను ఇన్స్టాల్ చేసుకోవడం ప్రాముఖ్యతపై కూడా దృష్టిని ఆకర్షించింది. పాత ఐఓఎస్ వెర్షన్లు ఉన్న వినియోగదారులకు టెలిగ్రామ్ నోటిఫికేషన్లు పంపడం, వారి డివైజ్‌లను అప్డేట్ చేసుకోమని ప్రోత్సహించడం ప్రారంభించినట్లు సమాచారం.సైబర్ నేరగాళ్లు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లు , హానికరమైన ఆన్లైన్ కంటెంట్ ద్వారా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలోని భద్రతా లోపాలను ఉపయోగించు కోవాలని సూచించింది ఆపిల్.
