అటు కరోనా, ఇటు వర్షం.. టీఆర్ఎస్ కొంప మునిగిందా?
టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై బూతుల వర్షం.. జంట నగరాల్లో ప్రజల ఆక్రోశం
రెండు తెలుగురాష్ట్రాల్లో అకాల వర్షం ధాటికి ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ కొంప మునిగిందా? అనే వ్యాఖ్యానాలు వైరల్ అవుతున్నాయి. ఉరుముల్లేని పిడుగులా ఒక్కసారిగా మీదపడ్డ వాయుగుండం ధాటికి ముఖ్యంగా జంటనగరాలు అతలాకుతలమయ్యాయి. ఆంధ్రా తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ వస్తే మనమేంటో చూపిస్తాం..మన సత్తా ఏమిటో చూపిస్తాం.. చంద్రబాబు చేసిందేమిటి? గొప్ప..అంతకన్నా వందింతలు మిన్నగా చేసి..జంట నగరాలు..దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన నేతలందరూ వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. నియోజకవర్గాలకు వెళితే.. జనం తన్నేలా ఉన్నారని భావించి.. గండం గడిచి..నీళ్లు ఎప్పుడు లాగుతాయోనని ఇంట్లోనే భయంభయంగా కాలక్షేపం చేస్తున్నారు.
తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంది..మరేం చేశారు..ఇన్నాళ్లు ఆంధ్రావోళ్లని ఆడిపోసుకొని..ఆంధ్రా సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని ఆళ్ల మీద బతికేశారు. సరే వాళ్లేమీ చేయలేదు..మరి మీరు మొనగాళ్లు వచ్చారు కదా..మీరేం చేశారని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల వర్షం పడి..తెరిపిిచ్చిన తర్వాతైనా సరే ప్రజాప్రతినిధులు రాకపోవడంతో ప్రజలు నోటికి వచ్చిన తిట్లు తిడుతున్నారు. ఇన్నేళ్లు అధికారంలో ఉండి.. హైదరాబాద్ కి ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల వర్షం ధాటికి మనుషులు పడిపోతే వారిని తీసే దిక్కేలేదని ప్రజాప్రతినిధులను పట్టుకొని ప్రజలు బూతులు తిడుతున్నారు. తొక్కతీసేస్తాం అంటున్నారు.
కొన్నికోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని చెప్పిన కేసీఆర్, కేటీఆర్ అందరూ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్షం ధాటికి విలవిల్లాడిన తెలంగాణలో.. దుబ్బాకలో జరిగే ఉపఎన్నికపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలపై..కచ్చితంగా ప్రభావం ఉంటుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి వచ్చిన వర్షం.. తెలంగాణనే కాదు..టీఆర్ఎస్ కొంపే ముంచిందనే వ్యాఖ్యానాలు వినిపించడం విశేషం.
