KCR : క‌త్తులు దూస్తున్న కారు..క‌మ‌లం

బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటంటున్న హ‌స్తం

KCR : నిన్న మొన్న‌టి దాకా ప్ర‌శాంతంగా ఉన్న‌ట్టు అనిపించిన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క‌సారిగా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ఉందేమోన‌న్న హీట్ పెరిగింది.

శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే కాకా మొద‌లైంది.

మాట‌ల‌తో మంట‌లు రాజేయ‌డం, వాటిని చ‌ల్లార్చ‌డం ఈ దేశంలో మోదీ, కేసీఆర్ కు మించిన వాళ్లు లేరు.

నిన్న‌టి మొన్న‌టి దాకా స్నేహ గీతం పాడుకున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి, భార‌తీయ జ‌న‌తా పార్టీలు ఇప్పుడు క‌య్యానికి కాలు దువ్వుతున్నాయి. నువ్వెంత అనే స్థాయికి చేరుకున్నాయి.

ఒక‌రిపై మ‌రొక‌రు దాడుల‌కు దిగే స్థాయికి దిగ‌జారాయి. ఇక బూతుల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. గుండు, ముండ‌, బోసిడికె,

సోయి త‌ప్ప‌డం, తొక్కి పారేస్తం , క్షుద్ర విద్య ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ (KCR)శ్రేణులు మాట‌ల‌తో దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఇక బీజేపీ తానేమీ త‌క్కువ తిన‌లేద‌న‌ట్టు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా హ‌వా చెలాయిస్తోంది.

ఈ రెండు పార్టీలు ఒక‌రిపై మ‌రొక‌రు చేసిన కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల గురించి చెబుతున్నాయి.

ఇక రాష్ట్రంలో ల‌క్షా 90 వేల‌కు పైగా ఖాళీలు ఉన్నాయ‌ని ఎందుకు భ‌ర్తీ చేయ‌డం లేదంటూ బీజేపీ నిల‌దీస్తోంది.

ఇదే స‌మ‌యంలో దేశంలో ఉన్న ఉద్యోగాలు ఊడ‌గొడుతూ కార్పొరేట్ కంపెనీల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ సంస్థ‌ల‌ను అమ్మేస్తున్నారంటూ టీఆర్ఎస్ (KCR)ఫైర్ అవుతోంది.

ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ ఒక్క‌టేనంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా పార్ల‌మెంట్ సాక్షిగా మోదీ చేసిన కామెంట్స్ పై గులాబీ భ‌గ్గుమంది.

ఈ త‌రుణంలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేప‌ట్టారు. భారీ ఎత్తున గొడ‌వ‌లు కూడా జ‌రిగాయి. హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వ‌చ్చిన మోదీకి ఆహ్వానం ప‌ల‌క‌లేదు.

త‌న‌కు జ్వ‌రం వ‌చ్చింద‌ని రాలేద‌ని చెప్పినా బీజేపీ కావాల‌నే రాలేద‌ని ప్ర‌చారం చేసింది. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు కేంద్రంపై యుద్దాన్ని ప్ర‌క‌టించ‌డంతో గులాబీ బాస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు అల‌ర్ట్ గా ఉండాల‌ని హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం.

ఏ స‌మ‌యంలోనైనా దాడులు జ‌రిగే ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీతో ట‌చ్ లో ఉన్న వ్యాపారులు, సంస్థ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించిన‌ట్లు తెలిసింది.

ఈడీ, ఇన్ కం ట్యాక్స్ , సీబీఐ వంటి సంస్థ‌లు రంగంలోకి దిగే చాన్స్ ఉంద‌ని ఇప్ప‌టికే కొంద‌రు భ‌య‌ప‌డుతున్నారు. అధికార పార్టీలో ఇండ‌స్ట్రియ‌లిస్ట్ లు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార‌స్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులలో గుబులు మొద‌లైంద‌ని బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : అరుదైన జ్ఞాప‌కం చిర‌స్మ‌ర‌ణీయం

Leave A Reply

Your Email Id will not be published!