BANW vs PAKW : ఇది ఊహించని షాక్ . పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు. న్యూజిలాండ్(BANW vs PAKW )వేదికగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా అన్ని మ్యాచ్ లలో విజయం సాధించి టాప్ లో కొనసాగుతోంది.
ఇక భారత్ మూడు మ్యాచ్ లు ఆడి రెండింట్లో గెలుపొందింది. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. హోమిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠ భరితంగా సాగింది.
ఇదిలా ఉండగా ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై తొలిసారి బంగ్లా దేశ్ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ లలో పరాజంయ పాలైంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే 235 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 225 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ జట్టులో సిద్రా అమీన్ అద్భుతంగా ఆడింది.
సెంచరీ చేసినా తన జట్టును గట్టెక్కించ లేక పోయింది. చివరి దాకా శ్రమించింది. ఎలాగైనా సరే తన జట్టును గెలిపించాలని. కానీ చేసిన ప్రయత్నం ఫలించ లేదు.
ఇక పాకిస్తాన్ టీమ్ లో ప్రధానంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లు బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లా టీమ్ లో ఫర్గానా హక్ 71 పరుగులతో దుమ్ము రేపింది.
నిగర్ సుల్లానా 46 రన్స్ తో సత్తా చాటింది. పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఆఖరులో నిలిచింది. టోర్నీలో ఆడే ప్రతి జట్టు మిగతా అన్ని జట్లతో ఆడాల్సి ఉంటుంది.
Also Read : లక్మల్ నిష్క్రమణ ద్రవిడ్..కోహ్లీ అభినందన