Eatala Rajender Amit Shah : ట్ర‌బుల్ షూట‌ర్ తో టార్చ్ బేర‌ర్ భేటీ

అమిత్ షాను క‌లిసిన ఈట‌ల రాజేంద‌ర్

Eatala Rajender Amit Shah : భార‌తీయ జ‌న‌తా పార్టీలో ట్రుబుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను తెలంగాణ‌లో టార్చ్ బేర‌ర్ గా పేరొందిన ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender Amit Shah) ఢిల్లీలో క‌లిశారు.

ఈట‌ల షాను క‌ల‌వ‌డం అధిక ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చకు దారి తీసింది. రాబోయే రోజుల్లో తెలంగాణ‌లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసేలా, ముందుకు తీసుకువెళ్లేందుకు గాను ఈట‌ల‌ను ఢిల్లీకి పిలిపించిన‌ట్లు స‌మాచారం.

గ‌త కొంత కాలంగా బీజేపీ విస్తృత కార్య‌క్ర‌మాల‌ను తీసుకుంది. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ వ‌స్తోంది.

ఇదే స‌మ‌యంలో రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. దీంతో తెలంగాణ‌లో ఎన్నిక‌లు రాక ముందే రాజకీయాల ప‌రంగా వేడి మొద‌లైంది.

మ‌రో వైపు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడ‌తానంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌డంతో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే చాన్స్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ త‌రుణంలో బీజేపీని టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదిగ‌గేలా చేసేలా పావులు క‌దిపేందుకు సీనియ‌ర్ల తో భేటీ అవుతూ వ‌స్తున్నారు అమిత్ షా.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో బీజేపీకి బిగ్ మైలేజ్ తీసుకు రావ‌డంలో ఈట‌ల రాజేంద‌ర్ స‌క్సెస్ అయ్యారు. బ‌హుషా భార‌త దేశ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఎన్న‌డూ ఏ పార్టీ ఖ‌ర్చు చేయ‌నంత ఖ‌ర్చు చేశార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈట‌ల‌ను ఓడించేందుకు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేవారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ప్ర‌జ‌లు ప్ర‌జా నేత‌కు ప‌ట్టం క‌ట్టారు.

ప్ర‌జ‌ల్ని స‌మీక‌రించ‌డంలో , బీసీల‌ను చైత‌న్య‌వంతం చేయ‌డంలో ఈట‌ల‌కు ప‌ట్టుంద‌నే పేరుంది. మొత్తంగా అమిత్ షా(Eatala Rajender Amit Shah) తో ఈట‌ల భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read : కోచింగ్ సెంట‌ర్ల గుర్తింపు 46 మంది అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!