Achhennaidu : రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనను జనం ఛీదరించు కుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు(Achhennaidu). చంద్రబాబు పాలన చారిత్రక అవసరమని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడును ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చేది క్లాస్ వార్ కాదని క్యాష్ వార్ అని స్పష్టం చేశారు. మాయ మాటలు చెప్పి ప్రజల చెవుల్లో పూలు పెట్టిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
రాష్ట్రంలో పాలన పడకేసిందని, అవినీతి, అక్రమాలు, నేరాలు ఘోరాలు పెరిగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వారి సత్తా ఏమిటో చూపించడం ఖాయమన్నారు. ఈ దేశంలో అందరి సీఎంల కన్నా అత్యంత ధనవంతుమైన జగన్ మోహన్ రెడ్డి ఎలా పేదవాడు అవుతాడని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. ప్రజలు ఈ అరాచక పాలనను తట్టుకోలేక పోతున్నారని తమ దెబ్బ ఏమిటో రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారని జోష్యం చెప్పారు.
పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న ఏపీ సీఎం జగన్ కు మూడిందన్నారు. త్వరలోనే తమ సర్కార్ ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. జనం చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నారని, అందుకే అశేష జనవాహిని తరలి వచ్చారని అన్నారు కింజారపు అచ్చెన్నాయుడు.
Also Read : Rahul Gandhi
